సోదర, సోదరీల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వచ్చేసింది. రాఖీ పండుగకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు. దీనినో పండుగలా జరుపుకుంటారు. కోవిడ్ కారణంగా గతేడాది నుంచి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా పండుగలను వర్చువల్ విధానంలో జరుపుకోవాల్సి వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా మన వాళ్లతో కనెక్ట్ అవుతున్నాం. 


ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రతి పండుగకు విభిన్న రీతిలో స్టిక్కర్లను అందిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఇటీవల వినూత్న స్టిక్కర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు రాఖీ పండుగకు కూడా స్టేటస్, స్టిక్కర్లు, జిఫ్‌ల రూపంలో మన తోబుట్టువులకు విషెస్ పంపే సదుపాయాన్ని కల్పించింది. వీడియో కాల్స్, మెసేజ్‌ల కంటే కూడా ఈ రాఖీ స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పడం కచ్చితంగా మీకో డిఫరెంట్ అనుభవాన్ని ఇస్తుంది. అలాంటి ఫీలింగ్ రావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేయండి. 



వాట్సాప్‌లో రాఖీ స్టిక్కర్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..



  • మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.

  • ఏదోక కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకోండి.

  • చాట్ బాక్స్‌లోకి వెళ్లి ఎమోజీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

  • అందులో మనకు “+” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోండి.

  • దానిని కింద వరకు స్క్రోల్ చేస్తే.. 'గెట్ మోర్ స్టిక్కర్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ప్రెస్ చేయండి.

  • ఇప్పుడు వాట్సాప్ మనల్ని గూగుల్ ప్లేస్టోర్‌కు రీడైరెక్ట్ చేస్తుంది.

  • ప్లేస్టోర్‌లో వాట్సాప్ స్టిక్కర్ పాక్స్ అని సెర్చ్ చేయండి. 

  • ఇందులో చాలా థర్డ్ పార్టీ స్టిక్కర్ పాక్ యాప్స్ కనిపిస్తాయి.

  • వాటిలోంచి రాఖీకి సంబంధించిన స్టిక్కర్లు ఉన్న యాప్ ఎంచుకోండి.

  • ఆ తర్వాత ‘యాడ్ టు వాట్సాప్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • మనం ఎంచుకున్న స్టిక్కర్ ప్యాక్స్ వాట్సాప్ లో మై స్టిక్కర్స్ సెక్షన్లో కనిపిస్తాయి. 

  • వాటిని ఎంచుకుని మీ సోదరి లేదా సోదరులకు సెండ్ చేయండి. 


Also Read: Raksha Bandhan 2021: రాఖీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇవి ట్రై చేయండి


Also Read: Rakhi 2021: టామ్ అండ్ జెర్రీ.. బ్రదర్ సిస్టర్స్ రాఖీ ఎలా చేసుకుంటారంటే..!


Also Read: Hayagriva Jayanti: రాఖీ పౌర్ణమి రోజు మరో విశిష్టత హయగ్రీయ జయంతి.. విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజు