2023 దాదాపుగా వచ్చేసింది. మీకు ఇష్టమైన వారితో ఈ సందర్భాన్ని జరుపుకోవాలనుకుంటున్నారా? వారి చుట్టూ ఉండటం ఎల్లప్పుడూ మనకు సాధ్యం కాదు. కానీ టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పాలి. మేం వీడియో కాల్స్ ద్వారా మా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వగలం. గత కొన్ని సంవత్సరాలుగా విషెస్ పంపడానికి స్టిక్కర్‌లు కూడా ప్రముఖ ఆప్షన్‌గా మారాయి. మీరు మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టిక్కర్‌లను పంపి విషెస్ చెప్పవచ్చు.


WhatsAppలో హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్లను ఎలా పంపాలి
హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లను పంపడానికి వినియోగదారులు ముందుగా వాటిని Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలా చేయడానికి Play Storeకి వెళ్లి, అక్కడ నుండి మీకు నచ్చిన ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.


మీరు మీకు నచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, దాన్ని ఓపెన్ చేసి, మీ WhatsAppకి యాడ్ చేయండి. యాప్‌కు ఈ స్టిక్కర్‌లను యాడ్ చేసిన తర్వాత, వినియోగదారులు వాట్సాప్‌కు వెళ్లి, వారి కాంటాక్ట్ చాట్ విండోను తెరిచి, వారికి నచ్చిన స్టిక్కర్‌లను ఎంచుకోవడం ద్వారా పంపవచ్చు. వినియోగదారులు ఎమోజీలపై క్లిక్ చేసి, స్టిక్కర్‌ల కోసం కుడివైపున ఉన్న ట్యాబ్‌కు వెళ్లవచ్చు, ఇక్కడే అన్ని కొత్త హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లు ఉంటాయి.


ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించి స్టిక్కర్‌లను పంపగలరని గుర్తుంచుకోండి. Apple iPhone వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్నేహితులను తమకు ఇష్టమైనదిగా గుర్తించగల స్టిక్కర్‌లను పంపమని అడగవచ్చు. దాన్ని ఫేవరెట్ చేసుకుని వారి స్నేహితులతో పంచుకోవచ్చు.