Haier OLED Pro TV: హాయర్ కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలో 65 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. అంచులు లేని డిజైన్‌ను ఇందులో అందించారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్స్‌ను కూడా అందించారు. వాయిస్ అసిస్టెంట్ కమాండ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆటో లోలేటెన్సీ మోడ్‌ను కూడా ఇందులో అందించారు.
హాయర్ ఓఎల్ఈడీ ప్రో టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.2,39,990గా నిర్ణయించారు. అయితే కంపెనీ దీన్ని ప్రారంభ ధర అని మాత్రమే చెబుతోంది. దీని ఎమ్మార్పీ రూ.4.5 లక్షలుగా ఉంది. అంటే దాదాపు రూ.2.1 లక్షల తగ్గింపును ప్రారంభ సేల్‌లో అందించారన్న మాట. ఈ టీవీ ప్రస్తుతానికి రిటైల్ స్టోర్లలో మాత్రమే లభించనుంది.
హాయర్ ఓఎల్ఈడీ ప్రో టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 65 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్‌గా ఉండటం విశేషం. డాల్బీ విజన్ సపోర్ట్ ఇందులో అందించారు. హెచ్‌డీఆర్ కంటెంట్ ప్లేబ్యాక్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. గూగుల్ ప్లే స్టోర్‌కు యాక్సెస్ కూడా ఇందులో అందించారు.
ఇందులో 30W స్పీకర్లను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక సీఐ కార్డు స్లాట్ ఇందులో ఉండనుంది. ఇందులో క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అందించారు. బ్లూటూత్ వాయిస్ రిమోట్ ఈ టీవీతో పాటు లాంచ్ కానుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ప్రత్యేకమైన బటన్లు రిమోట్‌లో అందించారు.
మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపన్సేషన్ (ఎంఈఎంసీ) టెక్నాలజీని కూడా హాయర్ ఇందులో అందించింది. ఇది మోషన్ బ్లర్‌ను తగ్గిస్తుంది. అలాగే డైనమిక్ హెచ్‌డీఆర్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్), ఈఆర్క్, ఏఎల్ఎల్ఎంలను కూడా హెచ్‌డీఎంఐ పోర్టు ద్వారా ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు 23.2 కేజీలుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?