Google rolls out Reading Practice Feature: టెక్ దిగ్గజం గూగుల్ ప్లే బుక్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, కిడ్స్ స్పేస్ కోసం కొత్త 'రీడింగ్ ప్రాక్టీస్' ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం యూఎస్‌లోని వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ పిల్లలు చదవడానికి సహాయపడుతుంది. చదివేటప్పుడు పుస్తకంలో ఏదైనా కష్టమైన పదం కనిపిస్తే పిల్లలు దానిని ఎంచుకుని, దానిని ఎలా పలకాలో తెలుసుకోవచ్చు. గూగుల్ రీడింగ్ ప్రాక్టీస్ సాయంతో పిల్లలు ఎంత వరకు చదివారు, ఎక్కడ నుండి ప్రారంభించాలో కూడా ట్రాక్ చేయవచ్చు.
పిల్లల చదువులను ట్రాక్ చేయవచ్చుఈ ఫీచర్‌లో మంచి విషయం ఏంటంటే పిల్లలు కష్టమైన పదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, వారు దానిని బ్రేక్ చేసి చదవగలరు. రీడింగ్ ప్రాక్టీస్ ఫీచర్ పిల్లలు పూర్తి వాక్యాలను వినడానికి, ఏదైనా పదానికి సాధారణ అర్థాన్ని పొందడానికి సహాయపడుతుంది. తద్వారా పిల్లలు కథ లేదా కథనాన్ని బాగా అర్థం చేసుకోగలరు.
పిల్లలు చదువుతున్నప్పుడు తను చదివే పేరాగ్రాఫ్ నుంచి పొరపాటున చాలా దూరం వచ్చినట్లయితే ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌లో మళ్లీ ఇంతకు ఎక్కడి వరకు చదివాడో అక్కడికి వెళ్లిపోవచ్చు. ఆ పదాన్ని క్లిక్ చేయడం ద్వారా, అక్కడ నుండి రీడింగ్ ట్రాకింగ్ ప్రారంభమవుతుంది. పిల్లలు తాము చదువుతున్న అధ్యాయం లేదా కథనాన్ని ఎక్కడ కవర్ చేశారో తెలుసుకోగలుగుతారు. అంటే ఈ ట్రాకింగ్ ఫీచర్‌తో పిల్లలు ఏం చదువుతున్నారో తల్లిదండ్రులు కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
పేజీ చివరలో పాఠకులు మిస్సింగ్ లేదా తప్పుగా పలికిన ఏవైనా పదాలను తిరిగి అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా చూస్తే చిన్న పిల్లల చదువులో ఈ ఫీచర్ చాలా హెల్ప్ కానుంది.
ఒక్కోసారి మనం తీసుకునే ఫోటోల్లో ఇతర వ్యక్తులు కూడా కనిపిస్తుంటారు. వారిని ఈ ఫోటోలో నుంచి తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తన యూజర్ల కోసం ‘మ్యాజిక్ ఎరేజర్’ పేరుతో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీనిని ఉపయోగించి ఫోటోల్లో ఉన్న అనవసరమైన వ్యక్తులు లేదంటే అబ్జెక్టులను తొలగించుకునే అవకాశం ఉంటుంది.
నిజానికి ఈ ఫీచర్ గతంలో లేటెస్ట్ ఫిక్సెల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓల్డ్ ఫిక్సెల్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. అటు iOS, Android ఫోన్లలోనూ Google One సబ్ స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాజాగా గూగుల్ సంస్థ వెల్లడించింది. మ్యాజిక్ ఎరేజర్‌తో మీ ఫొటోల మీద సర్కిల్ చేయడం లేదంటే బ్రష్ చేయడం ద్వారా అనవసర వ్యక్తులు, వస్తువులను ఈజీగా తొలగించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఫోటోలో ఏమేమి తీసి వేయాలి అనే అంశాలకు సంబంధించి సలహాలు కూడా ఇస్తుందని వివరించింది.
ఇంతకీ ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ఫీచర్ ను ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు. గూగుల్ ఫోటోలు ఓపెన్ చేసి, ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయాలి. మ్యాజిక్ ఎరేజర్ అనే టూల్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టూల్స్ ఓపెన్ చేయాలి. అనంతరం మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోటోలో ఉన్న అనవసర విషయాలను తొలగించే అవకాశం ఉంటుంది.