Google News and Discovery Not Working: ప్రముఖ సెర్చ్ దిగ్గజం.. ‘గూగుల్’ (Google) సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. వార్తా సేవలను అందించే గూగుల్ న్యూస్, డిస్కవర్‌ సర్వీసులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో రోజూ ఈ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా వివిధ అప్‌డేట్స్, వార్తలను చదివే కోట్లాది మంది యూజర్స్‌ ఈ సేవలను అందుకోలేకపోయారు. అయితే, ఈ అంతరాయానికి గల కారణాలేమిటనేది గూగుల్ వెల్లడించలేదు.


ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే వివిధ ఘటనలు, వింతలు, విశేషాలు తెలుసుకోడానికి నెటిజనులు గూగుల్ డిస్కవర్, గూగుల్ న్యూస్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి వాటి సేవలు నిలిచిపోయాయి. దీంతో నెటిజనులు తమకు మాత్రమే ఆ సైట్స్ ఓపెన్ కావడం లేదా? అందరికీ ఈ సమస్య ఉందా అని తెలుసుకోడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు.


X (ట్విట్టర్) ద్వారా గూగుల్, గూగుల్ ఇండియాలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. కొన్ని దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇతర సేవలు కూడా డౌన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కొందరైతే తమ డేటా కూడా కనిపించడం లేదని లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, దీనిపై గూగుల్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. 














Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో