Gmail Secret Shortcuts: మనలో చాలా మంది జీమెయిల్ వాడుతూనే ఉంటారు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉన్నప్పటికీ మనకు తెలియని కొన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. వాటిని వాడితే మరింత ప్రభావవంతంగా జీమెయిల్‌ను ఉపయోగించవచ్చు. వాటిలో కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం.


కాన్ఫిడెన్షియల్ మెయిల్ తెలుసా? (Confidential Mail)
మొదటి ఫీచర్ కాన్ఫిడెన్షియల్ ఈ-మెయిల్‌కి సంబంధించినది. జీమెయిల్‌లో కూడా రహస్య ఈ-మెయిల్‌లను పంపవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీన్ని ఎనేబుల్ చేయడానికి, మీరు కొత్త ఈ-మెయిల్‌ను పంపుతున్నప్పుడు లాక్ గుర్తుపై నొక్కాలి. అంతే మీరు పంపే మెయిల్ కాన్ఫిడెన్షియల్‌గా మారిపోతుంది.


నెట్ లేకపోయినా మెయిల్స్ చూడవచ్చు (View Emails Offline)
వీటలో రెండో ఫీచర్ ‘వ్యూ ఈ-మెయిల్స్ ఆఫ్‌లైన్’. దీనిలో మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఈ-మెయిల్స్‌ను చదవవచ్చు. దీని కోసం మీరు జీమెయిల్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆఫ్‌లైన్ ఈ-మెయిల్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.


మెయిల్స్ షెడ్యూల్ చేయడం ఎలా? (Scheduling Mails)
వీటిలో మూడో ఫీచర్ షెడ్యూల్ ఈ-మెయిల్స్. దీన్ని ఉపయోగించి జీమెయిల్‌లో మీరు పంపే ఈ-మెయిల్స్‌ను అనుకున్న సమయానికి షెడ్యూల్ చేయవచ్చు. దీని కోసం మీరు షెడ్యూల్ ఆప్షన్‌కు వెళ్లి డేట్, టైమ్‌ను ఎంచుకోవాలి.


రైట్ క్లిక్ మెనూ గురించి తెలుసా? (Right Click Menu)
ఇందులో నాలుగో ఫీచర్ రైట్ క్లిక్ మెనూ. దీనిపై మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. అవి అటాచ్‌మెంట్, మూవ్ టు ట్యాబ్, రిప్లై ఆల్, సెర్చ్ ఆప్షన్. మీరు చేయాల్సిన టాస్క్‌లను సులభంగా పూర్తి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.


జీమెయిల్ షార్ట్‌కట్స్ (Gmail Shortcuts)
జీమెయిల్ ఐదో సీక్రెట్ ఫీచర్ షార్ట్‌కట్స్. మెయిల్‌ను చదివినట్లుగా మార్క్ చేయడానికి ‘Shift + I’ నొక్కండి. ఈ-మెయిల్ పంపడానికి cmd లేదా Ctrl + Enter నొక్కండి. ఇది కాకుండా మెయిల్ ఎవరికి పంపాలో వారిని జోడించడానికి ‘Shift + Ctrl + B’ని నొక్కవచ్చు.


Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?