Pebble smart ring: ప్రముఖ స్మార్ట్​ వాచ్​ తయారీ సంస్థ పెబుల్.. నూతర ఒరవడులు సృష్టిస్తూ ‘స్మార్ట్​ రింగ్​’తో మార్కెట్​లోకి దూసుకొచ్చింది. ఫ్యాషన్​ రంగాన్ని మరింత ఆకర్షనీయంగా మల్చుతూ ‘హాలో స్మార్ట్ రింగ్’ పేరుతో సొగసైన​ రింగ్​ను మార్కెట్​లోకి అందుబాటులో తెచ్చింది. స్మార్ట్​ రింగ్​ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థగా నిలిచింది. స్టెయిన్‌లెస్ స్టీల్ రింగ్ పైభాగంలో డిజిటల్ డిస్‌ప్లేతో ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ స్మార్ట్ రింగ్‌ కేవలం గాడ్జెట్ మాత్రమే కాదని.. అంతకుమించి  ఉంటుందని సంస్థ హామీ ఇచ్చింది.

Continues below advertisement

హెల్త్​ గురించి ఎప్పటికప్పుడు అప్​డేట్​ ఇచ్చేలా..వినియోగదారుల హెల్త్​ గురించి ఎప్పటికప్పుడు అప్​డేట్​ ఇచ్చేలా టెక్నాలజీని జోడిస్తూ Halo Smart Ringను రూపొందించారు.  హార్ట్​ రేట్​, శరీర పనితీరును, నిద్రను పర్యవేక్షిస్తుంది. స్టెప్స్​ను లెక్కిస్తుంది. హార్ట్​ రేట్​, టైమ్​,  బ్యాటరీ లైఫ్ వంటి కీలక అంశాలను డిస్​ప్లేపై ప్రదర్శిస్తుంది. నలుపు, బంగారం మరియు వెండి రంగుల్లో ఈ స్మార్ట్​ రింగ్​ లభిస్తోంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ రింగ్​ ఎంతో మన్నికైంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెంట్ కూడా.

ఒక్కాసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు రోజులు హాలో రింగ్ కేవలం ఆరోగ్య విషయాలే కాదు.. అంతకు మించి పనిచేస్తుంది. వినియోగదారులు ఈ రింగ్​తో తమ ఫోన్ కెమెరాను కంట్రోల్​ చేయవచ్చు. “Find My Ring” ఫంక్షన్‌ని ఉపయోగించి రింగ్‌ను గుర్తించవచ్చు. సోషల్ మీడియా యాప్‌లు, గేమ్‌లు ఇ-బుక్ రీడర్‌లను యాక్సెస్​ చేయవచ్చు. మల్టిపుల్​ స్పోర్ట్స్ మోడ్‌లకు కూడా సపోర్ట్​ ఇస్తుంది. నాలుగు రోజుల పాటు చార్జింగ్​ నిలిచేలా బ్యాటరీని రూపొందించారు. ఒక్కాసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు రోజుల బ్యాటరీ నిలుస్తుంది. 

Continues below advertisement

అందుబాటులోకి ప్రీ ఆర్డర్లుఫిట్‌నెస్ పట్ల దృష్టిపెట్టేవారు, టెక్ ప్రియులు, ఫ్యాషన్ పట్ల స్పృహ ఉన్న వినియోగదారులకు ఇది పర్​ఫెక్ట్​ gadget​ అని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో వినియోగదారులను  ఆకర్షించే లక్ష్యంతో  7 నుంచి 12 రకాల సైజ్​లతో హాలోను రిలీజ్​ చేస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ Pebbleలో ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడు స్టార్టింగ్​ ధర రూ.3,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ రింగ్ జూలై 4 నుంచి అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చింది. రూ. 7,999 MRPతో, ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ మరియు పెబుల్ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తోంది.