Noise Buds VS104: రూ.900 లోపే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - బేస్ మామూలుగా ఉండదు!

భారతదేశ ఆడియో బ్రాండ్ నాయిస్ కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే నాయిస్ బడ్స్ వీఎస్104.

Continues below advertisement

నాయిస్ మనదేశంలో కొత్త ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. అవే నాయిస్ బడ్స్ వీఎస్104. ఇవి 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. వీటిలో 13ఎంఎం డ్రైవర్లను అందించారు. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీని ఇందులో అందించారు. వీటి ధర, ఫీచర్లు తెలియాల్సి ఉంది.

Continues below advertisement

నాయిస్ బడ్స్ వీఎస్104 ధర
వీటి ధరను రూ.999గా నిర్ణయించారు. వీటిపై ఒక సంవత్సరం వారంటీని అందించనున్నారు. నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, వైట్, గ్రీన్, బ్లూ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వీటి సేల్ ప్రారంభం కానుంది. మొదటి 140 నిమిషాల్లో అదనంగా రూ.104 డిస్కౌంట్ అందించనున్నారు. అంటే రూ.895కే వీటిని కొనుగోలు చేయవచ్చన్న మాట.

నాయిస్ బడ్స్ వీఎస్ 104 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వీటిలో బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. 10 మీటర్ల రేంజ్‌ను ఇవి అందించనున్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌కు ఇవి కంపాటిబుల్ కానున్నాయి. గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, సిరిలను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌స్టా చార్జ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే ఒక సినిమా చూసేంత ప్లేటైంను ఇవి అందించనున్నాయని తెలుస్తోంది.

యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేయవచ్చు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఆరు గంటల ప్లేటైంను ఒక్కో బడ్ అందించనుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 30 గంటల వరకు ప్లేబ్యాక్ టైం లభించనుంది. ఈ ఇయర్ బడ్స్‌లో హైపర్ సింక్ టెక్నాలజీ కూడా ఉంది. దీని ద్వారా మీరు చార్జింగ్ కేస్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టంట్‌గా పెయిర్ అవుతాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్ చేయవచ్చు. 13 ఎంఎం డ్రైవర్లను ఇందులో అందించారు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement