ఇన్‌స్టాగ్రామ్ తాజాగా సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను మనదేశంలో టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను అందించే అవకాశాన్ని కంటెంట్ క్రియేటర్లకు ఇన్‌స్టాగ్రామ్ అందించనుంది. ప్రస్తుతానికి 10 మంది యూఎస్ కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ కొత్త పెయిడ్ ఫీచర్‌కు యాక్సెస్ వచ్చినట్లు తెలుస్తోంది. మనదేశంలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపారు.
సల్మాన్ మీనన్ అనే ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్లలో సబ్‌స్క్రిప్షన్ అమౌంట్ రూపాయల్లో చూపిస్తుంది. నెలకు రూ.85, రూ.440, రూ.890 విలువైన ప్లాన్లను ఇందులో చూపిస్తుంది. అంటే క్రియేటర్లు తాము క్రియేట్ చేసే కంటెంట్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే కనిపించేలా పెట్టుకోవచ్చన్న మాట. అంటే ఒకవేళ వీరు క్రియేట్ చేసిన రీల్స్ కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే కనిపించేలా పెడితే మీరు వాటిని చూడాలనుకున్నప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకోక తప్పదు మరి.
యూజర్ నేమ్ పక్కన పర్పుల్ బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. సబ్‌స్క్రైబర్లకు మాత్రమే కనిపించేలా స్టోరీస్, ఎక్స్‌క్లూజివ్ లైవ్ వీడియోస్, ఇంకా మరెన్నో ఆప్షన్లు వీరికి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి మనదేశంలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు.