గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. వీటిని మొదటిసారి ఈ సంవత్సరం మేలో జరిగిన గూగుల్ ఐవో 2022 ఈవెంట్లో వీటిని మొదటిసారి పరిచయం చేసింది.
గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ధర
వీటి ధరను మనదేశంలో రూ.19,990గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. జులై 28వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. వీటిని ప్రీ-ఆర్డర్ చేసే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో బీమ్ ఫార్మింగ్ మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నాయిస్ సప్రెషన్ కోసం అల్గారిథంలను ఉపయోగించారు. దీంతోపాటు కస్టం ఆడియో చిప్ కూడా ఉంది. ఇవి చార్జింగ్‌ను సమర్థవంతంగా వాడతాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ అయ్యాక ఏఎన్‌సీ ఆన్ చేస్తే ఏడు గంటలు, ఆఫ్ చేస్తే 11 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి.
ఇందులో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్‌ను అందించారు. 40 భాషల్లోని కంటెంట్‌ను ఇది ట్రాన్స్‌లేట్ చేయగలదు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జింగ్ పెట్టవచ్చు. త్వరలో వీటికి స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా అందించనున్నారు. దీంతో ఇవి యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోతో పోటీ పడనున్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!