క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఇది 4కే హెచ్‌డీఆర్ వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేయనుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు వాయిస్ రిమోట్‌ను కూడా అందించనున్నారు. ఇందులో ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉండనుంది.
క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ ధర
క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ ధరను రూ.6,399గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. స్నో కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో రిటైట్ అవుట్‌లెట్లలో కూడా ఇది అందుబాటులో ఉండనుందని గూగుల్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇది కాంపాక్ట్ డిజైన్‌తో లాంచ్ అయింది. హెచ్‌డీఎంఐ పోర్టు ద్వారా దీన్ని టీవీకి కనెక్ట్ చేయవచ్చు. సినిమాలు, షోలు, యాప్స్, సబ్‌స్క్రిప్షన్లను ఈ స్ట్రీమింగ్ డివైస్ అందించనుంది. వినియోగదారులకు మొత్తం కంటెంట్‌ను ఒకే చోట ఇది అందించనుంది.
ఈ లేటెస్ట్ క్రోమ్‌కాస్ట్ మోడల్ 4కే హెచ్‌డీఆర్ స్ట్రీమింగ్‌ను అందించనుంది. డాల్బీ విజన్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. హెచ్‌డీఎంఐ ద్వారా డాల్బీ ఆడియోను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. వాయిస్ రిమోట్‌ను దీంతోపాటు అందించనున్నారు.
యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ప్రత్యేక బటన్లు ఈ రిమోట్‌లో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, స్పాటిఫై, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, ఎంఎక్స్ ప్లేయర్, వూట్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు 118 గ్రాములుగా ఉంది. ఇది రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్‌లతో ఇది పోటీ పడనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!