బోట్ మనదేశంలో కొత్త బడ్జెట్ పోర్టబుల్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. అదే బోట్ స్టోన్ 135. ఐపీఎక్స్4 సర్టిఫికేషన్‌ను ఈ స్పీకర్ పొందింది. అంటే నీటిలో తడిసినా ఏమీ కాదన్న మాట. అయితే దీంతోపాటు చాలా కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.
బోట్ స్టోన్ 135 ధర
దీని ధరను రూ.799గా నిర్ణయించారు. యాక్టివ్ బ్లాక్, బోల్డ్ బ్లూ, సోల్జర్ గ్రీన్, స్పేస్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఇండియా, బోట్ లైఫ్ స్టైల్ స్టోర్లలో ఈ స్పీకర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ధర లాంచ్ ఆఫర్ కింద నిర్ణయించినది అయితే తర్వాత పెరిగే అవకాశం ఉంది.
బోట్ స్టోన్ 135 స్పీకర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్పీకర్ 5W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించనుంది. వైర్‌లెస్ కనెక్షన్స్ కోసం బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. ఈ స్పీకర్‌లో టీఎఫ్ కార్డు స్లాట్ కూడా ఉంది. కాబట్టి మీకు కావాల్సిన లాంగ్స్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు కనెక్ట్ చేసి ప్లే చేసుకోవచ్చు. 10 మీటర్ల రేంజ్ వరకు మీరు కనెక్ట్ చేసిన డివైస్‌కు ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది.
ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 80 శాతం వాల్యూమ్‌తో 11 గంటల పాటు దీంతో మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. మైక్రో యూఎస్‌బీ కనెక్టివిటీ పోర్టు, ఐపీఎక్స్4 సర్టిఫికేషన్ కూడా ఇందులో అందించారు. దీంతోపాటు బోట్ ఎక్స్‌టెండ్ స్పోర్ట్ స్మార్ట్ వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ఏకంగా 700కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!