BGMI now available: Battle Ground Mobile India అంటే BGMI నేటి నుండి ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. మీరు గేమ్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అది ఇప్పుడు మీ ఫోన్‌లో రన్ కాకపోవచ్చు లేదా చాలా తక్కువ మంది వ్యక్తుల ఫోన్‌లలో పని చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే గేమ్ దశల వారీగా రోల్ అవుట్ అవుతోంది. ఇది క్రమంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ మీ ఫోన్‌లో గేమ్ రాకపోతే ఈ ట్రిక్‌ను ఫాలో అవ్వండి.


గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ BGMI 2.5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. మీరు డౌన్‌లోడ్ చేసిన తర్వాత 'సర్వర్ నాట్ ఆన్‌లైన్' లేదా 'రోల్అవుట్ ఇన్ ఫేజ్' అని వస్తుంటే, గేమ్‌ను ఓపెన్ చేయడానికి ఈ ట్రిక్‌ని అనుసరించండి.


1. ముందుగా మొబైల్ డేటా లేదా వైఫైని ఆఫ్ చేసి, బీజీఎంఐని క్లోజ్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ నుంచి కూడా తీసేయండి
2. ఇప్పుడు ఐదు సెకన్లపాటు వేచి ఉన్న తర్వాత మళ్లీ గేమ్‌ను తెరవండి. ఇక్కడ ఇంటర్నెట్‌ని ఓపెన్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది.
3. ఇంటర్నెట్‌ని ఆన్ చేయండి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లాగిన్ చేయండి
4. లాగిన్ అయిన తర్వాత మీరు గేమ్ ఆడగలరు


మేము ఈ ట్రిక్‌ని ప్రయత్నించాం. గేమ్ పని చేయడం స్టార్ట్ అయింది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించవచ్చు. ఇప్పటికీ మీ ఫోన్‌లో గేమ్ రన్ కానట్లయితే, మీరు మరో 48 గంటలు వేచి ఉండాలి. అప్పుడు గేమ్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.


మొదటి విషయం ఏమిటంటే BGMI పర్మనెంట్ ఇంకా రాలేదు. ఇది తాత్కాలిక దశలో ఉంది. మూడు నెలల తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడగలరు. అలాగే గేమ్‌కు లాగిన్ చేయడానికి వారికి తల్లిదండ్రుల అనుమతి అవసరం. 18 ఏళ్లు పైబడిన వారు రోజులో 6 గంటలు మాత్రమే గేమ్ ఆడగలరు. అలాగే ఒక రోజులో గరిష్టంగా రూ.7,000 పెట్టుబడి పెట్టవచ్చు.


బీజీఎంఐపై మూడు నెలల తాత్కాలిక ఆమోదాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఈ సమయంలో అధికారులు ఈ ఆటపై నిఘా ఉంచుతారు. ఒకవేళ గేమ్ నిర్వాహకులు ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే దీన్ని మళ్లీ నిషేధించే అవకాశం ఉంది.


సర్వర్ లొకేషన్‌లు, డేటా భద్రత తదితర అంశాల్లో నిబంధనలను పాటిస్తామని కంపెనీ చెప్పడంతో బీజీఎంఐకి మూడు నెలల తాత్కాలిక అనుమతి లభించిందని ఈ సమయంలో ప్రభుత్వం గేమ్‌పై నిఘా ఉంచి తుది నిర్ణయం తీసుకుంటుందని ఐటీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు.