ఇండియన్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తన కంపెనీ నుంచి వచ్చిన వాచ్ లకు తోడుగా మరో స్మార్ట్ వాచ్ ను జనాల ముందుకు తీసుకొచ్చింది. ఫైర్ బోల్ట్ హల్క్ పేరుతో ఈ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్, AMOLED డిస్‌ప్లే, లేటెస్ట్ ఫీచర్లతో పాటు మధ్య తరగతి వినియోగదాలకు అందుబాటలో ఉండే ధరతో వచ్చింది. ఇప్పటికే వీటికి జనాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ఫైర్-బోల్ట్ హల్క్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఫైర్-బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. బ్లూటూత్ వెర్షన్ 3.0 సహాయంతో కాలింగ్ అవకాశాన్ని కలిగి ఉంటుంది. స్పీకర్, మైక్ తో పాటు క్విక్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ సహా పలు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ చతురస్రాకారంలో ఉంటుంది. ఆల్వేస్-ఆన్-డిస్ ప్లే(AOD)ను కలిగి ఉంటుంది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 368 x 448 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది.
45mm కలిగిన ఈ స్మార్ట్ వాచ్ 24×7 హార్ట్ బీట్ తో పాటు కచ్చితమైన SpO2 మానిటరింగ్ చేస్తుంది. రోజంతా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుంది. fire-Boltt హెల్త్ సూట్‌లో భాగంగా స్లీప్ ట్రాకర్ ను కలిగి ఉంటుంది. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. క్యాలరీలను ట్రాక్ చేయడంతో పాటు శ్వాసను సైతం ట్రాక్ చేసే అవకాశం ఉంది. నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. దీన్ని ధరించిన వ్యక్తి ఎలా నిద్రపోతున్నాడో చెప్తుంది. సరిపడ నిద్ర పోతున్నాడా? లేదా? అనేది వివరిస్తుంది.
కాలిక్యులేటర్ వంటి యుటిలిటీ ఆధారిత ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇది పలు యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్ లను కూడా చూపిస్తుంది. మ్యూజిక్ వినే అవకాశం ఉంటుంది. అంతర్నిర్మిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన వాయిస్ అసిస్టెంట్‌ని కలిగి ఉంది. ది ఫైర్-బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీని కలిగి ఉంటుంది. IP67 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
ధర ఎంత? ఎక్కడ లభిస్తుందంటే?
ఫైర్-బోల్ట్ హల్క్ ధర మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ. 3,499గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ పలు ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తో పాటు ఆఫ్ లైన స్టోర్లలోనూ లభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ స్మార్ట్ వాచ్ పలు రంగుల్లో లభ్యం అవుతుంది. గోల్డ్ పింక్, బ్లూ, సిల్వర్ గ్రేతో పాటు బ్లాక్ కలర్ వేరియంట్ లో అందుబాటులో ఉంది.
Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి