File Sharing Techniques Without Internet : మొబైల్ నుంచి మొబైల్‌కు.. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను షేర్ చేయడం ఈరోజుల్లో సర్వ సాధారణం. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఫైల్ ఎలా పంపాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఇంటర్నెట్ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైల్స్ పంపించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా సులభంగా, సురక్షితంగా, వేగంగా ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును ఇంటర్నెట్ లేకుండా మీ Android లేదా iPhoneలో ఫైల్‌లను పంపడానికి హెల్ప్ చేసే 7 సింపుల్ మార్గాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బ్లూటూత్ (Bluetooth)
నెట్ లేకుండా ఏవైనా ఫైల్స్ పంపాలనుకున్నప్పుడు రెండు ఫోన్‌ల బ్లూటూత్‌ను ఆన్ చేసి.. పెయిర్ చేయాలి. ఆపై ఫైల్ పంపుకోవచ్చు. ఫోటోలు, పాటలు, చిన్న డాక్యుమెంట్‌లు పంపేందుకు ఇది సరిపోతుంది. పెద్ద వీడియో ఫైల్‌ల పంపాలనుకుంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.
వై-ఫై డైరెక్ట్
Wi-Fi Direct సాంకేతికత ఇంటర్నెట్ లేకుండానే వేగంగా ఫైల్‌లను పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రెండు ఫోన్‌లలో Wi-Fi Directని ఆన్ చేసి కనెక్ట్ చేయండి. ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీ నుంచి ఫైల్‌ను పంపవచ్చు.
నియర్‌బై షేర్ (Nearby Share)
ఇది కేవలం Android ఉపయోగించేవారికి మాత్రమే. ఐఫోన్ వారికి ఈ సౌలభ్యం ఉండదు. ఈ నియర్‌బై ఫోన్ సెట్టింగ్‌లలో ఆన్ చేయవచ్చు. ఇది యాక్టివేట్ అయిన తర్వాత.. ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, డాక్యుమెంట్‌లను సులభంగా షేర్ చేసుకోవచ్చు.
ఎయిర్‌డ్రాప్
ఇది కేవలం Apple వినియోగదారులకు మాత్రమే. AirDrop అనేది ఫైల్స్ పంపేందుకు సులభమైన మార్గం. దీనికోసం AirDropని ఆన్ చేసి ఫైల్‌ను పంపండి. iPhone నుంచి iPhoneకి చాలా వేగంగా ఫైల్ ట్రాన్సఫర్ చేయవచ్చు.
USB OTG కేబుల్
హార్డ్‌వేర్‌తో నేరుగా బదిలీ చేసుకోవచ్చు. మీ దగ్గర OTG కేబుల్ ఉంటే.. మీరు ఒక ఫోన్‌ను నేరుగా మరొకదానికి కనెక్ట్ చేయవచ్చు. ఈ పద్ధతి వేగంగా ఉంటుంది. పెద్ద ఫైల్‌లను కూడా ఈజీగా షేర్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ యాప్‌లు
ప్లేస్టోర్‌లో ఇంటర్నెట్ లేకుండా లోకల్ హాట్‌స్పాట్‌ను ద్వారా ఫైల్‌లను బదిలీ చేసే అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు SHAREit, Xender, Zapya మొదలైనవి ఫైల్స్ పంపేందుకు హెల్ప్ చేస్తాయి. అయితే థర్డ్ పార్టీ యాప్‌లలో డేటా దొంగతనం జరిగే ప్రమాదం ఉంది.
QR కోడ్ స్కానింగ్ ద్వారా
కొన్ని యాప్‌లు ఫైల్‌ను QR కోడ్‌గా మార్చడం ద్వారా షేరింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ఎదురుగా ఉన్న ఫోన్ ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.ఫైల్ సులభంగా బదిలీ అయిపోతుంది.