చిన్న చిన్న వీడియోలతో వరల్డ్ వైడ్‌ ఫేమస్ అయిన టిక్‌టాక్‌ భారత్‌లో నిషేధించారు. ఆ తర్వాత అదే ఫార్మాట్‌లో చాలా యాప్స్ వచ్చాయి. ఆ స్థాయిలో పాపులర్ కాకపోయినా ఆదరణ మాత్రం బాగుంది. దీన్ని ప్రభావంతో ఇన్‌స్టాగ్రామ్‌ కూడా తన ఫీచర్స్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. 


భారత్‌లో టిక్‌టాక్ నిషేధించినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల్లో ఇంకా ఉండనే ఉంది. అందుకే ఆ సంస్థ భారత్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ తన రీల్స్ ఫీచర్స్‌లో మార్పుల చేసింది. ఇప్పటి వరకు అరవై సెకన్లు మాత్రమే ఉండే ఇన్‌స్టా రీల్ ఇప్పుడు 90 సెకన్లకు పెంచింది. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం తన రీల్స్  కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండింటిలోనూ కొన్ని అప్‌డేట్స్‌ చేసింది. కొత్త ఫీచర్లను కూడా జోడిస్తోంది. ఫేస్‌బుక్‌ (Facebook) రీల్స్‌లోని "సౌండ్ సింక్" ఫీచర్ అత్యంత ఆకట్టుకోనుంది. 


సౌండ్ సింక్ ఫీచర్ మీ వీడియో క్లిప్‌లకు అటాచ్ చేసుకోవచ్చు. టిక్‌టాక్ (TikTok) నుంచి ప్రేరణ పొందిన యూట్యూబ్‌ తన షార్ట్స్‌లో చాలా మార్పులు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి డబ్బు ఆర్జించే అవకాశాలు పెరుగుతున్నందున మెటా భారీగా మార్పులు చేస్తోంది. 


"ఈ రోజు, మనం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్(Facebook, Instagram) రీల్స్‌లో కొత్త క్రియేటివ్ టూల్స్ విడుదల చేయడం స్టార్ట్ చేశాం. ఇవి రీల్స్‌ను తయారు చేయడం, సవరించడం సులభతరం చేయడమే కాకుండా, కొత్త వ్యూవర్స్‌ను మరింత చేరువ చేస్తాయి." అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసింది. 


"ఫేస్‌బుక్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు మీ చేసిన రీల్స్‌ అందేలా మేం మీకు సాయం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా రీల్స్‌ చూసేలా అప్‌డేట్ చేశాం. ఫేస్‌బుక్‌ (Facebook) ఫీడ్, గ్రూప్‌లు, వాచ్‌లలో కూడా రీల్స్ కనిపిస్తాయి. ఇన్‌స్టా (Instagram)లో క్రియేటర్‌లు తమ కంటెంట్‌ను విస్తరించేందుకు ఫేస్‌బుక్‌(Facebook)లో తమ రీల్స్‌ను సిఫార్సు చేసే అవకాశం ఉంది" అని కంపెనీ చెప్పింది. 


ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వస్తున్న కొత్త టూల్స్ ఇవే


1. వీడియోను 90 సెకన్ల వరకు పెట్టుకోవచ్చు.


2. స్టిక్కర్లను ఉపయోగించి మీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.


3. మీ ఆడియోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.


4. టెంప్లేట్‌ల ద్వారా ప్రేరణ పొందొచ్చు.


పేస్‌బుక్‌ రీల్స్‌(Facebook Reels)కి వచ్చే కొత్త టూల్స్ ఇవే


డెస్క్‌టాప్‌లో Facebook రీల్స్‌ని సృష్టించి, షెడ్యూల్ చేయవచ్చు.


రీల్స్‌కు క్లిప్ చేయవచ్చు


కొత్త ఆడియో సాధనాలతో మీ పేస్‌బుక్‌ (Facebook) రీల్స్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.