XMail: మీరు ఈమెయిల్ కోసం ఏ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా మందికి గూగుల్ అందిస్తున్న జీమెయిల్‌ను గుర్తు వస్తుంది. ఎందుకంటే జీమెయిల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈమెయిల్ సర్వీస్. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ఇంతకు ముందు పేరు ట్విట్టర్) ఇప్పుడు ఈమెయిల్ సర్వీస్ విషయంలో గూగుల్‌తో పోటీ పడనుంది.
ఎక్స్‌మెయిల్ పేరుతో...
వాస్తవానికి గూగుల్ జీమెయిల్‌కు పోటీగా, ఎక్స్ దాని ఈమెయిల్ సర్వీసు ఎక్స్‌మెయిల్‌ను ప్రారంభించనుంది. ఎక్స్ ఈమెయిల్ సర్వీసు గురించి గత కొన్ని వారాలుగా చర్చిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా ఎక్స్ ఈమెయిల్ సర్వీసు త్వరలో ప్రారంభించనున్నట్లు ధృవీకరించారు.
ఇప్పటి వరకు వినియోగదారులు ప్రపంచంలోనే అతిపెద్ద ఈమెయిల్ సర్వీసు అయిన జీమెయిల్‌కు మంచి ప్రత్యామ్నాయ ఎంపికను కనుగొనలేకపోయారు. కానీ ఇప్పుడు బహుశా ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వినియోగదారులకు మంచి ఆప్షన్ కావచ్చు. ఎక్స్ ఉద్యోగి అయిన నేట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఎక్స్‌మెయిల్ గురించి ఒక పోస్ట్ చేశాడు.
జీమెయిల్ గురించి అనేక పుకార్లు
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎలాన్ మస్క్ తన అధికారిక ఖాతా నుండి సమాధానం ఇస్తూ "అది వస్తోంది." అని ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ఈ సమాధానంతో అతను ఎక్స్‌మెయిల్ త్వరలో ప్రారంభించడాన్ని అధికారికంగా ధృవీకరించాడు. ఇప్పుడు ఎక్స్ ఈమెయిల్ సేవ ఎలా ఉంటుందో చూడవలసి ఉంది. ఎందుకంటే ఎక్స్ మైక్రో బ్లాగింగ్ సర్వీసులో అనేక చెల్లింపు సేవలను చూశాం. అటువంటి పరిస్థితిలో ఈమెయిల్ సర్వీసులో ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వేగంగా వ్యాపిస్తుంది. జీమెయిల్ సర్వీసును వచ్చే ఏడాది నుంచి మూసివేస్తారని చెప్తున్నారు. ఈ వార్త వ్యాప్తి చెందిన తర్వాత ఎక్స్ తన ఈమెయిల్ సర్వీసును ప్రకటించింది. అయితే గూగుల్ తన జీమెయిల్ సర్వీసును మూసివేస్తుందనే పుకార్లకు బ్రేకులు వేసింది. జీమెయిల్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వార్తలను ఖండించింది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?