ఫేమస్ మెస్సేజింగ్, వీడియో, ఆడియో కాలింగ్ యాప్ వాట్సాప్‌ను నమ్మలేమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శించారు. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని మాట ఇచ్చినప్పటికీ మెటా సంస్థ యూజర్ల ప్రైవేట్ మెస్సేజ్‌లను చదువుతోందని ఆరోపిస్తూ దాఖలైన క్లాస్-యాక్షన్ వ్యాజ్యంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌క్రిప్టెడ్ చాట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని, యూజర్లు ఇకనైనా X చాట్‌కు మారాలని ఎలాన్ మస్క్ సూచించారు. 

Continues below advertisement

ఎక్స్ చాట్ వాడాలన్న ఎలాన్ మస్క్ప్రముఖ పర్సనల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నమ్మలేం అని కామెంట్ చేసి ఎలాన్ మస్క్ గురువారం మెటాతో తన వైరంలో మరోసారి అగ్గి రాజేసారు. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ స్ట్రాంగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్ చేసినప్పటికీ, వినియోగదారుల ప్రైవేట్ సందేశాలను చదువుతోందని, వాటిని సేవ్ చేస్తుందని.. యాక్సెంచర్ వంటి థర్డ్ పార్టీలతో మెటా పంచుకుంటోందని ఆరోపిస్తూ కంపెనీపై దాఖలైన కొత్త క్లాస్ యాక్షన్ పిటిషన్‌పై మస్క్ స్పందించారు. యూజర్ల డేటా ప్రైవసీ ఎక్కడుందని వాట్సాప్‌ను ప్రశ్నించారు. యూజర్ల డేటా ప్రైవసీలో వాట్సాప్‌ను నమ్మలేమని పేర్కొన్న ఎలాన్ మస్క్.. మరొక పోస్ట్‌లో, మెసేజ్‌లు, వాయిస్/ వీడియో కాల్స్ కోసం X చాట్‌కు మారాలని వినియోగదారులకు సూచించారు. ఇక్కడ మీ డేటాకు ప్రైవసీ లభిస్తుందని పేర్కొన్నారు.

Continues below advertisement

మస్క్ ఆరోపణలపై వాట్సప్, మెటా ఆగ్రహం..తమ సంస్థపై ఎలాన్ మస్క్ చేసిన పోస్టుపై స్పందించిన వాట్సాప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వాట్సాప్ క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో పేర్కొన్న క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధం,  అసంబద్ధమైనవి. వాట్సాప్ దశాబ్ద కాలంగా సిగ్నల్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తోంది. కనుక మీ మెస్సేజ్‌లను పంపేవారు, రిసీవ్ చేసుకునే వారు తప్ప మరెవరూ వాటిని చదవలేరని వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. 

వాట్సాప్ మెసెంజర్ ద్వారా మరొక వ్యక్తితో చాట్ చేసినప్పుడు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగిస్తుంది. చాట్ బయట ఉన్నవారు, చివరికి వాట్సాప్ కూడా వాటిని చదవలేదు. మీ ఆడియోను కూడా వినలేదు, ఎవరితోనూ షేర్ చేసుకోవు. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో మీ సందేశాలు లాక్‌తో భద్రంగా ఉంటాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి, చదవడానికి కావాల్సిన కీ కేవలం సెండర్, రిసీవర్ వద్ద మాత్రమే ఉంటుందని వాట్సాప్, మెటా సంస్థ పేర్కొంది. 

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్‌లపై మెటా విచారణఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్‌లపై విచారణ జరుగుతోంది. మెటా కంపెనీ వాట్సాప్ మెస్సేజ్‌లు యాక్సెస్ చేయగలదని మాజీ మెటా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై అమెరికా లా ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని ఈ ఏడాది బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ దర్యాప్తును అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక ఏజెంట్లు చేస్తున్నాయి. 2024లో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలైన ఇలాంటి విజిల్‌బ్లోయర్ ఫిర్యాదుపై కంపెనీ విచారణను ఎదుర్కొంది.

వాట్సాప్ కోసం కంటెంట్ మోడరేషన్ పని చేసిన ఇద్దరు వ్యక్తులు గత ఏడాది కామర్స్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్‌తో పలు విషయాలు తెలిపారు. మెటాలోని కొంతమంది సిబ్బందికి వాట్సాప్ మెస్సేజ్‌లకు యాక్సెస్ ఉందని సంచలనానికి తెరలేపారు. కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌లోని కొంతమంది ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యం కల్పించారని చెప్పడంతో ఆందోళన నెలకొంది.  తమ వర్క్ లొకేషన్లో వాట్సాప్‌నకు యాక్సెస్ ఉన్న వారు ఉన్నట్లు ఆధారాలు లభించాయని గతంలో ఓ ఏజెంట్ పేర్కొన్నారు. లార్కిన్ ఫోర్డైస్ అనే వ్యక్తి యాక్సెంచర్‌లో కాంట్రాక్టర్‌గా మెటా కోసం కంటెంట్ మోడరేటర్‌గా చేశారని, కాంట్రాక్టర్‌లకు కూడా మెస్సేజ్ యాక్సెస్ లభించిందని నివేదిక పేర్కొంది. 

వాట్సాప్ యూజర్ల మెస్సేజ్‌లు స్టోర్ చేస్తోందని ఆరోపణలువాట్సాప్ సందేశాలు ప్రైవేట్ కావని ఒక కొత్త క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో ఆరోపించారు. వాట్సాప్, మెటా ప్లాట్‌ఫామ్స్, యాక్సెంచర్ పీఎల్‌సీ, యాక్సెంచర్ ఎల్‌ఎల్‌పీలు అక్రమంగా యూజర్ల ప్రైవేట్ వాట్సాప్ సందేశాలను చదవడంతో పాటు థర్డ్ పార్టీలతో పంచుకున్నాయని బ్రియాన్ వై. షిరాజీ, నిదా శామ్సన్ క్లెయిమ్ చేశారు. వినియోగదారులు ప్రైవేట్ మెస్సేజ్‌లను పంపుకోగలిగే సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా కంపెనీలు వాట్సాప్‌ను మార్కెటింగ్ చేశాయని, కానీ వాస్తవానికి వాట్సాప్, మెటా ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులు పంపిన ప్రైవేట్ మెస్సేజ్‌లు చదవడం, స్టోర్ చేయడం, థర్డ్ పార్టీకి డేటా షేర్ చేశారని పిటిషనర్లు షిరాజీ, శామ్సన్ ఆరోపించారు.

‘ఎన్‌క్రిప్ట్ చేసిన, యాక్సెస్ చేయడానికి వీలులేకుండా ఉండాల్సిన వాట్సాప్ సందేశాలపై మెటా ఉద్యోగులతో పాటు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌లకు యాక్సెస్ ఉందని విజిల్‌బ్లోయర్లు ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లకు సమాచారం ఇచ్చారు. యూజర్ల మెస్సేజ్‌లు ప్రైవేట్ అని హామీ ఇచ్చిన వాట్సాప్, వాటిని సీక్రెట్‌గా చదవడం, స్టోర్ చేయడతో పాటు థర్డ్ పార్టీలకు షేర్ చేసుకోవడం వారి ప్రైవసీకి భంగం కలిగించడమే’ అని క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో ర్కొంది.