Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?

ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు.

Continues below advertisement

Twitter New Logo: ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఈసారి ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేశారు. ఇకపై ట్విట్టర్‌ను ‘X’ అని పిలవాలట. ట్విట్టర్ లోగోను కూడా మార్చేశారు. ఇప్పుడు మారిన లోగోను డెస్క్ టాప్ వెర్షన్‌లో చూడవచ్చు. అయితే ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యాప్‌ల్లో దీనికి ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదు. ‘x.com’ వెబ్‌సైట్‌కి లాగిన్ అయితే అది ‘Twitter.com’కి రీడైరెక్ట్ అవుతుంది.

Continues below advertisement

ఎలాన్ మస్క్ ‘X’ కొత్త లోగోతో హెడ్ క్వార్టర్స్ ఫొటోను షేర్ చేశారు. ‘X’ ఆకారంలో లైటింగ్ ప్రధాన కార్యాలయం పైన పడుతుంది. ఈ ఫోటోను కంపెనీ సీఈవో లిండా యాకారినో కూడా పోస్ట్ చేశారు. నేడు (సోమవారం) ఎలాన్ మస్క్ తన ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చారు. ఎలాన్ మస్క్‌తో పాటు ట్విట్టర్ ఇతర అధికారిక హ్యాండిల్స్ ప్రొఫైల్ పిక్ కూడా ఛేంజ్ చేశారు. 

ట్వీట్లను ఏమని పిలుస్తారు?
ట్విట్టర్ ఉన్నప్పుడు ఇందులో చేసే పోస్టును ట్వీట్ అనే వారు. ఇప్పుడు ఏమని పిలుస్తారు? అని ఒక యూజర్ అడిగినప్పుడు ‘x’s’ అని పిలవాలని ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. మరి రీట్వీట్‌ను ఏమని పిలుస్తారని ఒక యూజర్ అడిగినప్పుడు ‘దాని గురించి మళ్లీ ఆలోచించాలి’ అని ట్వీట్ చేశాడు.

ట్విట్టర్‌కు పోటీగా మెటా కూడా థ్రెడ్స్ అనే యాప్‌ను ఈ నెల 6వ తేదీన లాంచ్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ యాప్ 100 మిలియన్ల యూజర్ మార్కును అందుకోవడం విశేషం. కానీ కొత్త తరహా ఫీచర్లను ఎప్పటికప్పుడు అందించకపోవడంతో ఇప్పుడు యూజర్స్ ఫ్లో కొంచెం తగ్గింది. కానీ మస్క్ వ్యవహార శైలి కారణంగా ట్విట్టర్ మీద యూజర్లు కాస్త నెగిటివ్‌గా ఉన్న మాట వాస్తవం. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ‘థ్రెడ్స్’ కూడా విఫలం అవుతుంది.

Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola