ఒకప్పుడు క్రికెట్ మ్యాచులు వస్తే లైవ్ టెలికాస్ట్ చూడటం కోసం భారతీయులు అందరూ ఏ టీవీలో వస్తుందో తెలుసుకుని ఆ ఛానల్ ఆన్ చేసేవారు. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. కొత్త సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ టీవీలు, ఫోన్స్ వాడకం పెరిగింది. దాంతో అందరూ ఓటీటీలకు అలవాటు పడ్డారు. ప్రజెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జరుగుతోంది. మూడో వన్డే చూడటం కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ ఓపెన్ చేసిన క్రికెట్ ప్రేమికులకు ఆ యాప్ చుక్కలు చూపించింది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ ఎందుకు పని చేయలేదు!?ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో వన్డే మీద భారతీయుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. దాంతో మ్యాచ్ చూసేందుకు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు యాప్ ఓపెన్ చేశారు. అయితే, సబ్‌స్క్రైబర్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ చుక్కలు చూపించింది. 

ఆన్ లైన్ రిపోర్ట్స్ ప్రకారం... సుమారు 84 శాతం మంది సబ్‌స్క్రైబర్లకు వీడియో స్ట్రీమింగ్ సమస్య తలెత్తింది. మరో 13 శాతం మందికి సర్వర్ కనెక్ట్ కాలేదు. మిగతా మూడు శాతం మందికి యాప్ ఓపెన్ చేయడంలో సమస్య తలెత్తింది. దాంతో యాప్ సబ్‌స్క్రైబర్లు అందరూ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ ఓపెన్ చేయడంతో యాప్ పాజ్ కాగా... సినిమా చూసేందుకు యాప్ ఓపెన్ చేసిన ఆడియన్స్, మూవీ లవర్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు. కొంత సేపు సినిమాలు చూడటం కూడా కష్టమైంది. 

కస్టమర్ కేర్‌ను సంప్రదించండి...లేదా మళ్ళీ యాక్టివేషన్ చేసుకోండి!యాప్ యూసేజ్ సమస్యలతో విసిగిన సబ్‌స్క్రైబర్లకు వచ్చిన నోటిఫికేషన్స్ లేదా సూచనలు మరింత ఆగ్రహం తెప్పించాయి. కస్టమర్ కేర్‌ను సంప్రదించమని లేదా మళ్ళీ యాక్టివేషన్ చేసుకోమని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి సలహాలు రావడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే... ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా!

పలువురు సబ్‌స్క్రైబర్లకు హిందీ ఆడియో మాత్రమే స్ట్రీమింగ్ కావడం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణం అయ్యింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ప్రజలు ఈ సమస్య ఎదుర్కొన్నారు. అయితే, ఈ సమస్య మీద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఇప్పుడు ఈ సమస్య తీరింది. వెబ్, టీవీ, స్మార్ట్ ఫోనుల్లో యాప్ యథావిధిగా పని చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో నెటిజనుల ట్వీట్స్, రెస్పాన్స్ చూశాక ఏబీపీ దేశం సమస్య ఏమిటి? అని వెరిఫై చేసింది. అప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదు. యాప్ పని చేసింది.

Also Readఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?