Whatsapp QR Code: వాట్సాప్ కొత్త ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు పాత ఫోన్‌లో బ్యాకప్ చేయకుండా కొత్త ఫోన్‌లో ఛాట్స్ ఇంపోర్ట్ చేసుకునే ఫీచర్‌ను ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు ఛాట్స్ ఈ పద్ధతిలో మార్చుకోలేరు. ఐఫోన్ నుంచి ఐఫోన్‌కు, ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్‌కు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం పాజిబుల్ అవుతుంది.
క్యూఆర్ కోడ్ ఉపయోగించింది వాట్సాప్‌లో ఛాటింగ్‌లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఛాట్‌తో పాటు అందులోని ఫొటోలు, వీడియో, డాక్యుమెంట్లు, లింక్స్ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయితే కాల్ హిస్టరీ, పీర్ టు పీర్ పేమెంట్ మెసేజెస్ మాత్రం ట్రాన్స్‌ఫర్ కావు.
దీని కోసం ఆండ్రాయిడ్ 5.1 లేదా దాని తర్వాత వెర్షన్లు మీ ఫోన్‌లో ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా కొత్త ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి కానీ లాగిన్ చేయకూడదు. రెండు ఫోన్లలోనూ వైఫై ఎనేబుల్ చేయాలి. అదే ఐఫోన్‌లో అయితే వాట్సాప్ ఐవోఎస్ వెర్షన్ 2.23.9.77 కంటే పై వెర్షన్ అందుబాటులో ఉండాలి.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఛాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఇలా?
1. పాత ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
2. అందులో సెట్టింగ్స్‌లో ఛాట్స్ ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ కనిపిస్తున్న ట్రాన్స్‌ఫర్ ఛాట్స్‌లోకి వెళ్లండి.
3. కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ చేసి అదే నంబర్‌తో రిజిస్టర్ చేయండి.
4. అక్కడ కనిపిస్తున్న ‘స్టార్ట్ ఆన్ ట్రాన్స్‌ఫర్ ఛాట్ హిస్టరీ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్’పై క్లిక్ చేయండి.
5. దానికి అవసరమైన పర్మిషన్స్ ఇస్తే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.
6. మీ పాత ఫోన్‌లో ఈ కోడ్ స్కాన్ చేయాలి.
7. అవసరమైన పర్మిషన్లు అన్నీ ఇచ్చేశాక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
8. ఇంపోర్ట్ పూర్తయ్యాక, ‘డన్’పై క్లిక్ చేయండి.
ఐఫోన్‌లో వాట్సాప్ ఛాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఎలా?
1. ముందుగా పాత ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.
2. సెట్టింగ్స్‌లో ఛాట్స్‌లోకి వెళ్తే ‘Transfer Chats to iPhone’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో స్టార్ట్‌పై క్లిక్ చేయాలి.
3. కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయండి. మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేయండి.
4. ఇప్పుడు ఆ ఫోన్‌లో ‘Continue on Transfer chat history to iPhone’పై క్లిక్ చేయండి.
5. పాత ఫోన్‌లో కెమెరా ఓపెన్ చేసి, కొత్త ఐఫోన్‌లో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌పై క్లిక్ చేయండి.
6. ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యాక కొత్త ఫోన్‌లో ప్రొఫైల్ సెట్ చేసుకోండి.
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial