Perplexity Pro Free For Airtel Users : ఎయిర్‌టెల్ గురువారం అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Perplexity AIతో కీలక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా దాని 360 మిలియన్ల కస్టమర్లకు 17,000 రూపాయల విలువైన Perplexity ప్రోను ఉచితంగా ఇవ్వనుంది. మొబైల్, వై-ఫై, DTH కస్టమర్‌లతో సహా అన్ని ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏడాది పాటు ఈ Perplexity ప్రోను ఉచితంగా వాడుకోవచ్చు.
Perplexity ప్రో అంటే ఏమిటి?Perplexity అనేది AI-ఆధారంగా పని చేసే సెర్చ్ ఇంజిన్. ఇది వినియోగదారులకు సాధారణ భాషలో కావాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. వివిధ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమచారాన్ని ఒకసారి పరిశీలించి తక్కువ టైంలో కావాల్సిన కచ్చితమైన విషయాన్ని సూటిగా అందిస్తోంది.
Perplexity ఫ్రీగా కూడా ఉంటుంది. అయితే మరిన్ని సౌకర్యాలు ప్రో వెర్షన్‌లోఉన్నాయి. ఇందులో నిపుణులు, ఎక్కువ డేటాను కావాలనుకునే వాళ్లు మాత్రమే ప్రో వెర్షన్ వాడతుటుంటారు. ప్రో వెర్షన్‌లో సెర్చింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో వినియోగదారుకు మరిన్ని డైలీ ప్రో సెర్చ్‌లు, అధునాతన AI మోడళ్లకు యాక్సెస్ లభిస్తుంది. ఉదాహరణకు GPT 4.1, క్లాడ్ వంటివి కూడా ఈ ప్రో వెర్షన్‌లో లభిస్తాయి. నిర్దిష్ట మోడళ్లు ఎంచుకునే సామర్థ్యం, లోతైన పరిశోధన, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్‌లు, విశ్లేషణ, అలాగే Perplexity ల్యాబ్‌లు, ఆలోచనలకు ప్రాణం పోసే ప్రత్యేకమైన టూల్‌గా ఉంది.
Perplexity ప్రోను ఉచితంగా ఎలా పొందాలి?
- ఎయిర్‌టెల్ వినియోగదారులు Perplexity ప్రోను ఉచితంగా పొందడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్లి లాగిన్ అవ్వాలి
- రివార్డ్స్ విభాగం కింద, Perplexity ప్రోకి బ్రౌజ్ చేసి ‘క్లెయిమ్ నౌ’పై క్లిక్ చేయండి
- ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడిని నమోదు చేసి OTP పొందండి
- Perplexity ప్రోను ఉచితంగా యాక్సెస్ చేయడానికి కోడ్‌ను క్లెయిమ్ చేయడానికి OTPని ఎంటర్ చేయాలి.
- మీరు ఉపయోగించిన ఇమెయిల్ IDతో పర్‌ప్లెక్సిటీ యాప్‌ను తెరవండి
- OTPని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పర్‌ప్లెక్సిటీ ప్రో కోసం కోడ్‌ను నమోదు చేయాలి.
- ఇప్పుడు మీరు 12 నెలల పాటు పర్‌ప్లెక్సిటీ ప్రోను ఉచితంగా ఉపయోగించవచ్చు
Perplexity Pro ప్రయోజనాలుPerplexity Pro వినియోగదారులు రోజుకు వందలాది Pro రీసెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు Perplexity Pro మోడల్‌లను Pro రీసెర్చ్, రీజనింగ్ ను వాడుకోగలరు.
మీరు సరైన సోర్స్‌తో లోతైన విశ్లేషణలతో కూడిన సమాచారం కావాలంటే Sonar (ఇన్-హౌస్ మోడల్), GPT-4.1, Claude 4.0 Sonnet లేదా Gemini 2.5 Pro నుంచి ఎంచుకోండి.
సంక్లిష్టమైన విశ్లేషణాత్మక ప్రశ్నల కోసం R1 (USలో హోస్ట్ చేసిన Perplexity ఫైన్-ట్యూన్డ్, సెన్సార్ చేయని మోడల్), o3 (లేదా Max వినియోగదారుల కోసం o3-Pro), లేదా Claude 4.0 Sonnet Thinking (Max వినియోగదారుల కోసం Claude 4.0 Opus Thinking) Grok4 నుంచి ఎంచుకోండి.
బెస్ట్ మోడ్ : తక్షణ సమాచారం కోసం, డిఫాల్ట్ గా మీరు బెస్ట మోడ్‌లో ఉంటే మీకు కావాల్సిన సమాచారాన్ని నాలుగు రకాల ఏఐటూల్స్‌ను యూజ్ చేసి ఇస్తుంది. ఇందులో మీకు కావాల్సిన మోడ్‌ను మీరు ఎంచుకోవచ్చు.