How to Identify a Video is AI Generated or Real : నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. Facebook, Instagram, X, YouTube వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిరోజూ లక్షల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు, ఒక నాయకుడి ఆశ్చర్యకరమైన ప్రకటన కనిపిస్తుంది, మరికొన్నిసార్లు ఒక సెలబ్రిటీ వీడియో వస్తుంది. ఇందులో కొన్ని రియల్‌గా ఉంటే మరికొన్ని ఫేక్‌వి యి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా వీడియోలు ఫేక్ అయినా వాటిని నిజమైనవిగా అనిపించవచ్చు. ఇది గందరగోళానికి దారి తీస్తుంది. ప్రజలు ఆలోచించకుండా వాటిని నిజమని నమ్ముతారు.
వాస్తవానికి, AI మారుతున్న కాలంలో వీడియోలను తయారు చేయడం చాలా సులభమైంది. ఇప్పుడు, కొన్ని సెకన్లలో ఎవరి రూపాన్ని, స్వరాన్ని, హావభావాలను కాపీ చేయడం ద్వారా నకిలీ వీడియోలను తయారు చేయవచ్చు. అందుకే నిజమైన, నకిలీ వీడియోల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం సాధారణ ప్రజలకు కష్టంగా మారింది. అయితే, మీరు కొంచెం శ్రద్ధ పెడితే, కొన్ని సంకేతాల ద్వారా వీడియో AI ద్వారా క్రియేట్ చేసిందా లేదా అనేది సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి, AI ద్వారా ఏ వీడియో తయారైందో ఏది కాదో ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.
ముఖ కవళికలపై కన్నేయండి!
AI ఎంత అప్‌డేట్ అవుతున్నా, ముఖ కవళికలలో తరచుగా లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. డీప్‌ఫేక్ వీడియోలలో, చిరునవ్వులు కొన్నిసార్లు నిజమైనవిగా అనిపించవు, పెదవుల కదలికలు అంతగా మ్యాచ్ కావు. కనుబొమ్మలు, బుగ్గలు విచిత్రంగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. దీనితో పాటు, నిజమైన వ్యక్తి ముఖ కదలికలు సహజంగా ఉంటాయి, అయితే నకిలీ వీడియోలలో కొంచెం లోపం కనిపిస్తుంది.
లైట్, షాడోలను చెక్ చేయండి
నిజమైన వీడియోలో ముఖం, దుస్తులు, బ్యాక్ గ్రౌండ్ లైట్ సహజంగా ఉంటుంది. AI వీడియోలో, ఫేస్ లైట్ మిగిలిన ఫ్రేమ్‌కు భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నీడ కూడా వేరే దిశలో ఉంటుంది. అయితే కాంతి మరొక దిశ నుంచి కనిపిస్తుంది. వేర్వేరు షాట్‌లలో ముఖం కాంతిలో మార్పు స్పష్టంగా గమనించవచ్చు.
వీడియోను పాజ్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేయండి
ఏదైనా వీడియోపై అనుమానం ఉంటే, దాన్ని పాజ్ చేసి జాగ్రత్తగా గమనించండి. AI ద్వారా సిద్ధమైన వీడియోలలో, ముఖం అంచులు కొన్నిసార్లు అస్పష్టంగా కనిపిస్తాయి. జుట్టు విచిత్రంగా ఉంటుంది. బ్యాంక్ గ్రౌండ్‌తో కలిసిపోతుంది లేదా గ్లిచ్ కనిపిస్తుంది. కొన్నిసార్లు కళ్ళు లేదా దంతాల ఆకారంలో మార్పులు కూడా కనిపిస్తాయి. ఫ్రేమ్‌లోని విషయాలు ఒకేలా లేకపోతే, వీడియో నకిలీ కావచ్చు.
వాయిస్, టోన్ ద్వారా కూడా వ్యత్యాసాన్ని చెక్ చేయవచ్చు
డీప్‌ఫేక్ వీడియోలో, వాయిస్ తరచుగా అవసరమైన దానికంటే ఎక్కువ స్పష్టంగా లేదా మెషిన్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు స్వరంలో భావోద్వేగాల లోపం ఉంటుంది. టోన్ మొత్తం వీడియోలో ఒకే విధంగా ఉంటుంది. నిజమైన వ్యక్తి స్వరంలో హెచ్చు తగ్గులు, భావోద్వేగాలు ఉంటాయి, అయితే AI రూపొందించిన ఆడియోలో ఈ లోపం స్పష్టంగా అనిపిస్తుంది.
రివర్స్ సెర్చ్, ఫ్యాక్ట్ చెక్ టూల్స్ సహాయం తీసుకోండి
ఒక వీడియో వేగంగా వైరల్ అవుతుంటే, దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Google లెన్స్ లేదా Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించవచ్చు. వీడియో స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా మీరు దాని సోర్స్‌ను గుర్తించవచ్చు. దీనితో పాటు, InVID వంటి సాధనాలు వైరల్ వీడియోల ప్యాక్ట్ చెక్ చేయడంలో సహాయపడతాయి.
AI డిటెక్షన్ టూల్స్ సహాయం కూడా తీసుకోవచ్చు
నేడు, ఫోటోలు, వీడియోలు, ఆడియో, టెక్స్ట్ స్కానింగ్ చేసి, అది AI ద్వారా రూపొందించిందా లేదా అని చెప్పే అనేక వెబ్‌సైట్‌లు, సాధనాలు ఉన్నాయి. AI or Not, GPT Zero, Zero GPT, QuillBot Detector, ThecHive AI Detector వంటి సాధనాలు ఇందులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.