Claude Vs ChatGPT: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ వేగంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. భారత్‌లో ఇప్పుడు అనేక ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులో ఉండి, ప్రజల పనిని సులభతరం చేస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు తమ పనులను సులభతరం చేసుకోవడానికి ఏఐపై ఆధారపడుతున్నారు. ఈ టైంలో ఏఐ ప్రపంచంలో ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ ఒక ఫేమస్‌ ఏఐ చాట్‌బాట్‌. క్లాడ్ ఏఐ కూడా దీనికి గట్టి పోటీదారుగా నిలుస్తోంది. అయితే, ఈ రెండు ఏఐ చాట్‌బాట్‌ల మధ్య ఉన్న తేడాలు, అవి పనిచేసే విధానం గురించి చాలా మందికి అవగాహన లేదు.

Continues below advertisement

ChatGPT కంటే క్లాడ్‌ అంత కచ్చితమైందా?

ఒక AI మోడల్ కచ్చితత్వాన్ని కొలవడం అంత సులభం కాదు. ఏ AI మోడల్ ఫలితాలైనా మీరు ఉపయోగిస్తున్న మోడల్‌పైనా, దానికి మీరు ఇచ్చిన టాస్క్‌పైనా ఆధారపడి ఉంటాయి.

AA-ఓమ్నిసైన్స్ అక్యూరసీ బెంచ్‌మార్క్ ప్రకారం, ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో పోలిస్తే క్లాడ్ ఫేబుల్ 5 (మాక్స్) సుమారు 61 శాతం స్కోర్ చేయగా, GPT 5.6 సోల్ (మాక్స్) సుమారు 59 శాతం స్కోర్ చేసింది. అయితే, రోజువారీ వాడకంలో సగటు వినియోగదారులు ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం కొంత కష్టంగా ఉండవచ్చు.

Continues below advertisement

రోజువారీ పనుల్లో పెద్దగా తేడా లేదు

ఆ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం, మీరు సాధారణ ప్రశ్నలు అడగడానికి, ఇమెయిల్‌లు లేదా వ్యాసాలు రాయడానికి, ఒక డాక్యుమెంట్ సారాంశాన్ని సంగ్రహించడానికి లేదా కోడ్‌ను సిద్ధం చేయడానికి AIని ఉపయోగిస్తే, అప్పుడు క్లాడ్, చాట్‌జిపిటి రెండూ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు సాధారణ వినియోగదారుల నుంచి డెవలపర్‌ల వరకు అందరికీ యూజ్ అయ్యే టూల్స్ అందిస్తాయి. అయితే, మీ పని మరింత ప్రత్యేకమైందిగా, సంక్లిష్టమైందిగా మారే కొద్దీ, ఈ రెండింటి మధ్య తేడాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

క్లాడ్‌లో ఫీచర్లు ఏంటి?

మీ సమాచారం కోసం, క్లాడ్, చాట్‌జిపిటిల వినియోగ విధానాలు కూడా భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆంత్రోపిక్ ఎకనామిక్ ఇండెక్స్ వారి మార్చి 2026 నివేదిక ప్రకారం, క్లౌడ్ ప్రాంప్ట్‌లలో సుమారు 42 శాతం వ్యక్తిగత ఉపయోగం కోసం కాగా, 45 శాతం పనికి సంబంధించినవి. మిగిలిన ప్రాంప్ట్‌లు చదువులకు సంబంధించినవి.

ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ కూడా ఒక ఉపయోగకరమైన ఫీచర్. ఇది వినియోగదారులకు వివిధ నాలెడ్జ్‌-ఆధారిత టాస్క్‌లను AIకి అప్పగించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది ఫైల్ నిర్వహణ వంటి పనులను కూడా నిర్వహించగలదు.

దీనికి అదనంగా, క్లాడ్‌లో స్కిల్స్ అనే ఫీచర్ కూడా ఉంది, ఇది వినియోగదారులను నిర్దిష్ట ఆదేశాల సెట్‌ను క్రియేట్ చేసుకోవానికి, ప్రాంప్ట్‌ల సమయంలో అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.

AI హాలూసినేషన్ అంటే ఏమిటి?

AI కచ్చితత్వాన్ని చెస్‌ చేసేటప్పుడు, సరైన సమాధానం ఇవ్వడమే కాకుండా, ఒక ప్రశ్నకు సమాధానం తెలియనప్పుడు మోడల్ తప్పుడు సమాచారాన్ని సృష్టించకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. కాని కొన్ని సార్లు AI వాస్తవాలను వక్రీకరించేలా పని చేస్తుంది. దీన్ని హాలూసినేషన్ అంటారు. AA-ఓమ్నిసైన్స్ హాలూసినేషన్ రేట్ బెంచ్‌మార్క్‌లో తక్కువ స్కోర్ సాధిస్తే, ఒక AI మోడల్ మెరుగైనదిగా పరిగణిస్తారు. 

అందించిన డేటా ప్రకారం, క్లాడ్ ఫేబుల్ 5 55 శాతం స్కోర్ చేయగా, చాట్‌జిపిటి 5.6 సోల్ 89 శాతం స్కోర్ చేసింది. మిడ్‌ రేంజ్‌ మోడళ్లలో కూడా, క్లాడ్ సోనెట్ 5 37 శాతం, చాట్‌జిపిటి 5.6 టెర్రా 85 శాతం స్కోర్ చేశాయి. ఈ విషయంలో, హాలూసినేషన్ పరంగా క్లాడ్ పైచేయి సాధించింది.

క్లాడ్  ఆర్టిఫ్యాక్ట్స్‌ లక్షణాలు

మీ సమాచారం కోసం, క్లాడ్ ఆర్టిఫ్యాక్ట్స్ కూడా ఈ AI మోడల్ ఒక ముఖ్యమైన ఫీచర్. ఇది కోడ్, HTML వెబ్‌సైట్‌లు, రియాక్ట్ కాంపోనెంట్‌లు, డయాగ్రామ్స్‌, ఇతర ఇంటరాక్టివ్ విజువల్ ఎలిమెంట్‌లను క్రియేట్ చేయగలదు. ఈ విధంగా సృష్టించిన ఆర్టిఫ్యాక్ట్స్‌ను వెబ్‌లో కూడా పంచుకోవచ్చు.

మరోవైపు, ChatGPTలో కూడా స్కిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి, కానీ వాటిని క్లాడ్ కంటే భిన్నంగా ఉపయోగిస్తారు. ChatGPT స్కిల్స్‌ను కోడెక్స్, APIలతో ఉపయోగించవచ్చు, అయితే క్లాడ్ స్కిల్స్‌ను చాట్, క్లాడ్ కోవర్క్, క్లాడ్ కోడ్‌లో ఉపయోగించవచ్చు.

ChatGPTకి ఆధిక్యతను ఇచ్చేది ఏంటి?

కొన్ని సందర్భాల్లో, ChatGPT ఎక్స్‌పీరియన్స్‌ మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ వాయిస్ మోడ్. ChatGPT  వాయిస్‌ మరింత సహజంగా వినిపిస్తుంది, వినియోగదారులు డిస్కషన్ సమయంలో కొంత అంతరాయం కలగవచ్చు. అదనంగా, అడ్వాన్స్‌డ్ వాయిస్ మోడ్‌లో లైవ్ వీడియో ద్వారా రియల్‌ టైం హెల్ప్‌ పొందవచ్చు. వినియోగదారులు తమ సమస్యను కెమెరాకు చూపించడం ద్వారా కూడా ఏఐని అడగవచ్చు.

ChatGPT మరో ప్రధాన ప్రయోజనం దాని ఇమేజ్ జనరేషన్ ఫీచర్. ఇది టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా ఫోటోలను సృష్టించగలదు. మరోవైపు, క్లాడ్ ఎక్కువగా డయాగ్రామ్స్, చార్ట్‌లు,  ఇంటరాక్టివ్ విజువల్స్‌ను రూపొందించడంపై దృష్టి పెడుతుంది.