BSNL Recharge Plan: దేశంలోని ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. BSNL తన వినియోగదారుల కోసం చవకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఆ తర్వాత ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులు కావడం ప్రారంభం అయింది. నెలనెలా బీఎస్‌ఎన్ఎల్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది
రూ.1198 ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు లేదా 12 నెలలుగా ఉంది. ఈ ప్లాన్ లాభాల గురించి చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందిస్తారు. అంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ రాదన్న మాట. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ హై స్పీడ్ 3జీ/4జీ డేటాను పొందుతారు. దీంతోపాటు ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ ధరను నెలకు మారిస్తే కనీసం రూ.100 కూడా ఉండదు. అదే దీనికి అతి పెద్ద ప్లస్.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతో పాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకదాని ధరను కూడా తగ్గించింది. కంపెనీ తన రూ.1,999ను ప్లాన్ ధరను రూ. 100 తగ్గించింది. దీని ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఇందులో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు.
అదే సమయంలో రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా అందిస్తారు. ఈ ప్లాన్ ధర ఇంతకు ముందు రూ. 1,999గా ఉంది. ఇప్పుడు దీన్ని రూ. 1899కి తగ్గించారు. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచి సెకండరీ సిమ్‌గా ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుందని అనుకోవచ్చు.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?