బోట్ తన బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్‌పోడ్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే బోట్ ఎయిర్‌డోప్స్ 181. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీని కేస్‌ను చార్జింగ్ చేయవచ్చు. ఒక్కో ఇయర్‌పోడ్ బరువు కేవలం 2.9 గ్రాములు మాత్రమే కావడం విశేషం.
బోట్ ఎయిర్‌డోప్స్ 181 ధర
బోట్ ఎయిర్ డోప్స్ ధరను మనదేశంలో రూ.1,499గా నిర్ణయించారు. బోల్డ్ బ్లూ, కార్బన్ బ్లాక్, కూల్ గ్రే, స్పిరిట్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి.
బోట్ ఎయిర్‌డోప్స్ 181 ఫీచర్లు
ఈ ఎయిర్‌డోప్స్‌లో బీస్ట్ మోడ్ అనే ఫీచర్‌ను అందించారు. మీరు వినే ఆడియోను, చూసే వీడియోను సింక్ చేయడానికి లేటెన్సీని 65 ఎంఎస్‌కు తగ్గించే టెక్నాలజీ కూడా ఇందులో కంపెనీ అందించింది. 10ఎంఎం డ్రైవర్లను కూడా ఇందులో అందించారు. లిడ్ ఓపెన్ చేయగానే మొబైల్‌కు కనెక్ట్ చేసేందుకు ఐడబ్ల్యూపీ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
20 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. ఒక్కో బడ్ బరువు కేవలం 2.9 గ్రాములు మాత్రమే. బ్లూటూత్ వీ5.2ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. గ్రే, బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను అందించారు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా వీటిని చార్జ్ చేయవచ్చు.
వీటిలో ఫాస్ట్ చార్జింగ్ పీచర్‌ను కూడా అందించారు. 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 90 నిమిషాల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. బోట్ ఇటీవలే ఎయిర్‌డోప్స్ 601 ఏఎన్‌సీని లాంచ్ చేశాయి. వీటిలో హైబ్రిడ్ ఏఎన్‌సీ ఫీచర్‌ను కూడా అందించారు.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!