Blinkit to Deliver Sony PlayStation 5 Slim: ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ బ్లింకిట్ పెద్ద ప్రకటన చేసింది. ప్లేస్టేషన్ 5ను విక్రయించేందుకు సోనీకి సహకరిస్తామని కంపెనీ సీఈవో అల్బిందర్ దిండా తెలిపారు. అంటే మీరు ఇప్పుడు సోనీ ప్లేస్టేషన్ 5ని 10 నిమిషాల్లో ఇంటికి రప్పించుకోవచ్చన్న మాట. కంపెనీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 5వ తేదీన ప్లేస్టేషన్ 5ని విక్రయించడం ప్రారంభించింది.
ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వినియోగదారులు యాప్ ద్వారా పీఎస్ 5 స్లిమ్ కన్సోల్ రెండు వేరియంట్లను ఆర్డర్ చేయవచ్చు. ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లో కస్టమర్‌కు ఆర్డర్‌ని అందజేయాలని బ్లింకిట్ భావిస్తుంది. అయితే ఈ సదుపాయం ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు వినియోగదారులకు అందుబాటులో ఉండబోతోందని అల్బిందర్ ధిండా తెలియజేశారు.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
శాంసంగ్‌తో కూడా...
వేరే కంపెనీతో బ్లింకిట్ భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి కాదు. సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను దేశంలో పంపిణీ చేయడానికి బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బ్లింకిట్ ఆదాయం ఎంత పెరిగింది?
ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబైలలో నివసించే వినియోగదారులు బ్లింకిట్‌లో గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్‌ఫోన్‌లను ఆర్డర్ చేయవచ్చు. 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫోన్‌ను డెలివరీ చేస్తామని కంపెనీ ఆ సమయంలో తెలిపింది. బ్లింకిట్ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 724.2 కోట్లకు పెరిగింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 236.1 కోట్లుగా ఉంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది