Best Smartphones Under Rs 20000 | స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తున్నాయి. చాలా కంపెనీలు తమ బడ్జెట్ ఫోన్‌లలో 50MP కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీలను అందిస్తున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, కానీ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఏ టెన్షన్ అక్కర్లేదు. ఈ రోజు మీ కోసం 20 వేల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన చవకైన స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ఫీచర్లను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇందులో ఖరీదైన ఫోన్‌ల ఫీచర్‌లు ఉన్నాయి.
వివో టీ4ఆర్ (Vivo T4R 5G)
Vivoకి చెందిన ఈ ఫోన్ 6.77 అంగుళాల బిగ్ డిస్‌ప్లేతో వస్తుంది. మల్టీ టాస్కింగ్, బెస్ట్ పర్మార్మెన్స్ కోసం ఇది Dimensity 7400 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 GB RAM, 128GB స్టోరేజీలో మార్కెట్లోకి వచ్చింది. దీని వెనుక భాగంలో OISతో 50MP మెయిన్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 2MP ఉంది. ముందు భాగంలో ఇది 32MP లెన్స్‌తో వస్తుంది. 5700 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుండి రూ. 19,499లకు కొనుగోలు చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ (Infinix Note 50s 5G+)
చవకైన ధరలో Infinix సైతం అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్‌ను అందిస్తోంది. కంపెనీ Note 50s 5G+ 6.78 అంగుళాల Full HD+ డిస్‌ప్లే ఇచ్చింది. ఇన్ఫినిక్స్ ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఇది 13MP ఫ్రంట్ లెన్స్‌తో సర్వీస్ ఇస్తుంది. 5500 mAh బ్యాటరీ కలిగిన ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఫోన్‌లో Dimensity 7300 Ultimate ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 8 GB RAMతో మార్కెట్లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ ఫోన్ రూ. 17,999 ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఏదైనా కార్డుతో ఆఫర్ ఉంటే ఇంకా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
మోటోరొలా MOTOROLA G86 Power 5G
అందుబాటు ధరలో అంటే Motorola G86 Power 5G ఈ ఫోన్ మంచి చాయిస్. ఇది కూడా 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6720 mAh పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. Dimensity 7400 ప్రాసెసర్ ఇచ్చారు. దీని వెనుక భాగంలో 50MP+8MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 16,999లకు లిస్ట్ చేవారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఏదైనా కార్డులపై ఆఫర్ ఉంటే ఆ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.