Best 5G Smartphones Under Rs 12000: తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారు? ప్రస్తుతం అమెజాన్ 5జీ సూపర్ స్టోర్‌లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ డీల్స్‌లో రూ.12 వేలలోపే 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్స్‌లో భాగంగా శాంసంగ్, రియల్‌మీ, రెడ్‌మీ 5జీ ఫోన్లు ఉన్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ (Samsung Galaxy M15 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందించారు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.11,000 వరకు ధర తగ్గనుంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీలో 6.5 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఇన్‌ఫినిటీ యూ స్క్రీన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!


రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)
రెడ్‌మీ 12 5జీ స్మార్ట్ ఫోన్‌ను కూడా రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఈ ఫోన్‌పై కూడా రూ.11,000 తగ్గింపు లభించనుంది. అంతే కాకుండా కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.750 తగ్గింపును అందిస్తున్నారు.


ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై రెడ్‌మీ 12జీ రన్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. రెడ్‌మీ 12 5జీలో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.


రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G)
ఈ లిస్ట్‌లో రియల్‌మీ నార్జో కూడా ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా అదనంగా రూ.11,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.






Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!