Apple's Worldwide Developers Conference Dates: యాపిల్ కంపెనీ తన వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)ని ఆన్‌లైన్‌లో జూన్ 10 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.  డెవలపర్లు, స్టూడెంట్స్ ప్రారంభ రోజున యాపిల్ పార్క్‌లో జరిగే స్పెషల్ ప్రోగ్రాంలో వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. డెవలపర్స్ అందరికీ ఇది పూర్తిగా ఉచితం. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్‌ డెవలపర్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చిని పేర్కొంది. WWDC24 తాజా iOS, iPadOS, macOS, watchOS, tvOS, visionOS ల లేటెస్ట్ అప్‌డేట్స్‌ను వెల్లడించే అవకాశం ఉంది. 


యాపిల్‌ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లలో AI ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్‌ AI ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్‌, బైదూ.. వంటి AI సంస్థలతో పార్టనర్ షిప్ గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS) లను పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది.  ఇక ఐపాడ్‌ ఎయిర్‌, ఓఎల్‌ఈడీ ఐపాడ్‌ ప్రోలో కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


కానీ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే. అసలు ఈ ఈవెంట్‌లో ఏమి ఉంటున్నాయనే దాని గురించి Apple ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి.  Apple iOS 18 నుండి watchOS 11, VisionOS 2 వంటి అనేక విషయాలను ఆవిష్కరించనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా WWDC కూడా కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో నిర్వహించనున్నారు. Apple ఈ WWDC ఈవెంట్‌లో సాఫ్ట్‌వేర్ విభాగంపై మాత్రమే దృష్టి పెడుతుందని తెలుస్తోంది. హార్డ్‌వేర్ అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.  ప్రస్తుతం హార్డ్ వేర్ అప్ డేట్స్ వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా రూమర్లేనని తెలుస్తోంది.  


 Apple ఈ ఈవెంట్‌లో కొత్త యాప్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.  దానికి పాస్‌వర్డ్‌ యాప్ అని పేరు పెట్టారు. ఏదైనా వెబ్‌సైట్ లేదా సాఫ్ట్‌వేర్‌లో లాగిన్ ప్రక్రియను సులభతరం చేయడం ఈ యాప్ పని. అయితే ఈ యాప్ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. Apple కొత్త యాప్ iOS 18, iPadOS 18,  MacOS 15లో భాగమయ్యే ఛాన్స్ ఉంది.  ఈ యాప్ iCloud కీచైన్‌లో పని చేస్తుంది. ఇది వినియోగదారుల కోసం పాస్‌వర్డ్‌లను జనరేట్ చేస్తుంది. వాటిని సేవ్ చేస్తుంది.  


పాస్‌వర్డ్‌ల యాప్‌లో ప్రత్యేకత ఏమిటి?
పాస్‌వర్డ్‌ను రూపొందించడంతో పాటు, ఈ యాప్ వినియోగదారుల అన్ని లాగిన్ ఆధారాలను కూడా స్టోర్ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు Apple పరికరాలలో పాస్‌వర్డ్‌లు, ఖాతా వివరాలను సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. ఇందులో యూజర్లు పాస్‌వర్డ్‌లను కేటగిరీలుగా విభజించుకునే సదుపాయాన్ని పొందుతారు. అంటే వినియోగదారులు సోషల్ మీడియా, Wi-Fi , ఇతర పద్ధతుల కోసం పాస్‌వర్డ్‌లను వివిధ వర్గాలలో స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు, ఈ యాప్ ఆటోఫిల్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే, ఈ యాప్ క్రాస్ ప్లాట్‌ఫారమ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని సహాయంతో  వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చుచ. 


WWDC 2024లో ప్రత్యేకత ఏమిటి?
పాస్‌వర్డ్‌ల యాప్‌తో పాటు ఈ ఈవెంట్‌లో చాలా పెద్ద ప్రకటనలు ఉంటాయి. Apple ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా AI పై దృష్టి పెడుతుంది. తక్షణ ఫోటో ఎడిటింగ్, AI రూపొందించిన ఎమోజీలను క్రియేట్ చేసుకోవచ్చు.


ఈవెంట్లో వస్తాయనుకుంటున్న అప్ డేట్స్
iOS 18:  Apple తన పోటీదారులను ఎదుర్కోవాలని చూస్తుంది. iOS 18  కొత్త ఫీచర్లు, డిజైన్‌లతో కూడిన అప్ డేటెడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ఉంటుంది.  ప్రధానంగా AIపై దృష్టి సారిస్తుంది. iOS 18లో ఫోటో రీటౌచింగ్ అంటే అవాంఛిత వస్తువుల తొలగింపు,  ఎమోజీలు,  వాయిస్ మెమో ట్రాన్స్‌క్రిప్షన్‌లు వంటి ఇతర అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు. ఇమెయిల్‌లు, మెసేజ్ లకు రిప్లై, Safari వెబ్ సెర్చింగ్,  Apple Music ప్లే లిస్ట్ మొదలైనవి ఉంటాయి
macOS 15: మాకోస్, ఐఓఎస్‌లు ఉమ్మడి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే iOS 18లోని అనేక అప్ డేట్లు కూడా macOS 15లో వచ్చే ఛాన్స్ ఉంది.
సెట్టింగ్స్ యాప్:  ఈ ఈవెంట్‌లో iOS, iPadOS , macOS అంతటా మెరుగైన నావిగేషన్, విశ్వసనీయ సెర్చింగ్ చూడొచ్చు.
watchOS 11:  ఫిట్‌నెస్ వంటి కీలక యాప్‌లకు ప్రధాన మార్పుల ఆధారంగా రెస్పాన్స్ ఫార్మాటింగ్‌తో Siri ఇంటర్‌ఫేస్ అప్ డేట్ అయింది.
విజన్ ప్రో: visionOS 2 కొత్త ఫీచర్స్, పాస్‌వర్డ్‌ల యాప్, ఐప్యాడ్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లను ఫీచర్ చేసే ఛాన్స్ ఉంది.