Trinayani Serial Tilottama Pavitra Jayaram Replacement జీ తెలుగులో ప్రసారమయ్యే పాపులర్ సీరియల్స్‌లో '‘త్రినయని’' ఒకటి. ఈ సీరియల్ సూపర్ హిట్‌గా ఇప్పటికీ రన్ అవడంతో పాటు ఎంతో మంది అభిమానులను దక్కించుకోవడంలో విలన్ తిలోత్తమ చాలా ముఖ్య పాత్ర పోషించింది. తిలోత్తమ పాత్రలో నటించిన పవిత్రా జయరాం తన నటన, అభినయంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు సీరియల్ టాప్‌లో ఉండటంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఇటీవల యాక్సిడెంట్‌లో పవిత్రా జయరాం కన్నుమూశారు. దీంతో తిలోత్తమ పాత్రకు కొత్త నటిని పరిచయం చేసింది ‘త్రినయని’ టీమ్. ఇంతకీ ఆ నటి ఎవరు అంటే..
‘త్రినయని’ సీరియల్‌లో తిలోత్తమ పాత్రలో నటించిన పవిత్రా జయరాం చనిపోవడంతో ఆ పాత్ర పరిస్థితి ఏంటా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీరియల్‌లో హీరోహీరోయిన్ పాత్రలైన నయని, విశాల్‌ల కంటే విలన్ పాత్ర తిలోత్తమకే క్రేజ్ ఎక్కువ. దీంతో ఆ పాత్ర అంతే రేంజ్‌లో పోషించే నటి ఎవరు వస్తారా అని అందరూ చర్చించుకున్నారు. అయితే టీమ్ తిలోత్తమ పాత్రలో కొత్త నటిని సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సర్పదీవికి వెళ్లి తిలోత్తమ పూర్తిగా మారిపోయి వస్తుందని చెప్పి కొత్త క్యారెక్టర్‌ని దించారు. అందుకు తగ్గట్టు నటి చైత్ర హలికేరిని పరిచయం చేశారు.
చైత్ర హలికేరి ఓ కన్నడ నటి. కన్నడలో పలు సినిమాల్లోనూ నటించారు. తెలుగులో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన చైత్ర హలికేరి మా టీవీలో ప్రసారమయ్యే ‘నాగపంచమి’ సీరియల్‌లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో హీరో మోక్షకు తల్లి వైదేహిగా నటిస్తున్నారు. ‘త్రినయని’లో ప్రస్తుతం చైత్ర గ్లామరస్ తిలోత్తమగా ఆకట్టుకుంటున్నారు. దీనితో పాటు స్టార్‌మాలో వస్తున్న నాగపంచమి సీరియల్‌లో హీరో మోక్షకు తల్లి వైదేహి పాత్రలోనూ చైత్ర నటిస్తున్నారు.
మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన కన్నడ స్టార్ స్థాయికి చేరుకున్నారు చైత్ర హలికేరి. ఈమె కన్నడలో గురుశిష్యారు, శ్రీ దానమ్మ దేవి, ఖుషి వంటి పలు సినిమాల్లో నటించింది. ఇక కన్నడలో ఓ ఫేమస్ వంట షోలోనూ హోస్ట్ చేశారు. ఇక ఆమె బాలాజీ పోత్రాజ్ అనే వ్యాపార వేత్తని 2006లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక చైత్రకి ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు నిఖిలా.
పెళ్లి జరిగిన కొన్ని రోజులకే చైత్ర ఆమె తన భర్త, అత్తమామలపై పోలీస్ కేసు పెట్టంది. వాళ్లు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన సినిమాలు సీరియల్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆమె దాచుకోగా.. అత్తింటి వారు బ్యాంక్ ఖాతాను ఉపయోగించుకున్నారని కేసు పెట్టింది. అంతే కాకుండా చైత్ర పేరు మీద గోల్డ్ లోన్‌లు కూడా పెట్టేశారట.
కొత్త తిలోత్తమ పాత్ర చేతికి ఓ గ్లౌజ్ వేసుకొని ఉంటుంది. ఆ చేతిని ఎవరినీ తాకనివ్వదు. దాని వెనకే కథ నడుస్తుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో తిలోత్తమ కోడలు హాసిని ఆ చేతిని తాకడం తిలోత్తమ కోపంతో మంత్రాలు చదువుతూ చేతి మీద నిమ్మకాయ రసం పిండటంతో ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. తిలోత్తమ కొడుకు విక్రాంత్ తన తల్లి తిలోత్తమతో పాటు ఉలూచి పాప కాళ్లకు కూడా సాక్స్‌లు ఉండటం అవి తీయడానికి సుమన ప్రయత్నించగా పాప కూడా ఏడుస్తూ గోల చేయడం ఈ రెండు ఘటనల వెనక ఏదో రహస్యం ఉందని అనుమానిస్తాడు. ఇక తిలోత్తమ క్యారెక్టర్‌కి ప్రధాన శత్రువు గాయత్రీ దేవి పునర్జన్మలో పుట్టిన పాప గాయత్రీ ఆ చేతిని తాకితే ఏం కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేతి వెనక ఉన్న రహస్యంపై అందరూ ఫోకస్ చేయడం వల్ల సీరియల్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.
తిలోత్తమ సర్పదీవికి వెళ్లిన సమయంలో ఒక చేత్తో గాయత్రీ పాపని ఎత్తుకొని కుడి చేతితో పాముగా మారిన ఉలూచి పాప పట్టుకుంటుంది. అయితే అక్కడ దీపం వెలిగించడానికి ఉలూచి పాము నుంచి అగ్గి వస్తుంది. తిలోత్తమ దీపం అయితే వెలిగిస్తుంది. ఆ టైంలోనే తిలోత్తమ పాత్ర చేతికి ఏమైనా అయి ఉండవచ్చని అనుకుంటున్నారు.