Samsung Vs Apple: యాపిల్, శాంసంగ్ కంపెనీల మధ్య స్మార్ట్‌ఫోన్ల విషయంలో గట్టి పోటీ ఉంది. రెండూ వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఒకరి కస్టమర్‌లను మరొకరు ఆకర్షించే పోటీలో ఉన్నారు. ఐఫోన్ కొన్ని విషయాల్లో మెరుగ్గా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో శాంసంగ్ ముందుంది. ఈరోజు మనం ఏయే విషయాల్లో శాంసంగ్... యాపిల్ కంటే ముందున్న ఉందో తెలుసుకుందాం.
డిస్‌ప్లే టెక్నాలజీ
డిస్‌ప్లే టెక్నాలజీలో శాంసంగ్‌కు పోటీ లేదు. యాపిల్ కూడా శాంసంగ్ నుంచి దాని ఐఫోన్ల కోసం ఓఎల్ఈడీ ప్యానెళ్లను కొనుగోలు చేస్తుంది. రిజల్యూషన్, బ్రైట్‌నెస్ పరంగా ఐఫోన్ల కంటే శాంసంగ్ ఫోన్లు మెరుగ్గా ఉన్నాయి.
కస్టమైజేషన్
యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ ఎక్కువ కస్టమైజేషన్‌ను అనుమతించదు. మరోవైపు శాంసంగ్ ఫోన్లు ఐకాన్‌ల నుంచి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే వరకు ప్రతిదీ కస్టమైజేషన్ ఆప్షన్‌ను అందిస్తాయి. యాపిల్ లాగానే శాంసంగ్ కూడా థర్డ్ పార్టీ లాంచర్లు, సైడ్‌లోడెడ్ యాప్‌లపై ఎలాంటి పరిమితులను కలిగి ఉండదు.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
హార్డ్‌వేర్
శాంసంగ్ హార్డ్‌వేర్ పరంగా ప్రయోగాలు చేయడానికి భయపడదు. కంపెనీ ఫోల్డబుల్ ఫోన్‌లు దీనికి పెద్ద ఉదాహరణ. వీటి సాయంతో శాంసంగ్ మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది. కానీ యాపిల్ ఈ దిశగా అడుగు కూడా వేయలేదు.
బ్యాటరీ, ఛార్జింగ్
బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో కూడా శాంసంగ్ చాలా ముందుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే యాపిల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 16 ప్రో 4685 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ గురించి చెప్పాలంటే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అయితే యాపిల్‌లో ఇది 25W మాత్రమే.
లాక్ ఇన్ లేని ఎకో సిస్టం
యాపిల్ లాగానే శాంసంగ్ కూడా దాని స్వంత ఎకో సిస్టంను సృష్టించింది. కంపెనీ స్మార్ట్ రింగ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాల వరకు ప్రతిదాన్ని విక్రయిస్తోంది. అయితే యాపిల్ వంటి పరిమితులు లేవు. శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ని ఇతర కంపెనీల ఆండ్రాయిడ్ ఫోన్‌లతో కూడా పెయిర్ చేయవచ్చు. అదేవిధంగా శాంసంగ్ బడ్స్‌ను ఐఫోన్‌లకు కనెక్ట్ చేయవచ్చు. యాపిల్ ఉత్పత్తులు అలాంటి సౌకర్యాలను అందించవు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!