Apple AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పోటీ నిరంతరం పెరుగుతోంది. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ ఛాట్‌జీపీటీ తర్వాత పెద్ద కంపెనీలు కూడా ఏఐ రేసులో ముందుకు వెళ్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ యాపిల్ ఇప్పుడు ఏఐకి సంబంధించిన రేసులో చేరిందని సమాచారం.


ఉపయోగిస్తున్న యాపిల్ ఉద్యోగులు
ఐఫోన్, ఐప్యాడ్ వంటి అనేక గొప్ప ఉత్పత్తులను విక్రయించే టెక్ కంపెనీ యాపిల్ ఇప్పుడు ఛాట్‌జీపీటీ వంటి దాని సొంత జనరేటివ్ ఏఐని సిద్ధం చేసిందని వివిధ మీడియా నివేదికలలో పేర్కొన్నారు. ఈ నివేదికల ప్రకారం యాపిల్ ఇప్పటికే ఛాట్‌జీపీటీ వంటి ఇంటర్నల్ సర్వీసును క్రియేట్ చేసింది. ఈ సర్వీసు సాయంతో దాని ఉద్యోగులు కొత్త ఫీచర్‌లను పరీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి టెక్స్ట్ సమ్మరీలను సిద్ధం చేస్తున్నారు. ఆ ఏఐ ఇప్పటివరకు నేర్చుకున్న డేటా ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.


జూలైలో కూడా...
యాపిల్ జనరేటివ్ ఏఐని అభివృద్ధి చేయడం గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఈ ఏడాది జూలైలో కూడా అలాంటి వార్తలు వచ్చాయి. యాపిల్ తన ఏఐ మోడల్‌పై పనిచేస్తోందని అప్పుడే వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా యాపిల్ ఎల్ఎల్ఎం అజాక్స్ అనే కొత్త ఫ్రేమ్‌వర్క్‌పై తయారు చేశారు.


ఇప్పుడు యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్‌ల్లో పనిచేసే ఎల్ఎల్ఎం గురించి పరిశోధనా పత్రాన్ని దాఖలు చేసింది. పరిమిత డీఆర్ఏఎం సామర్థ్యం ఉన్న డివైస్‌లో పెద్ద లాంగ్వేజ్ మోడల్స్‌ను ఎలా అమలు చేయవచ్చో ఈ పరిశోధనా పత్రం వివరిస్తుంది. వాస్తవానికి పరిమిత డీఆర్ఏఎం సామర్థ్యంతో ఎల్ఎల్ఎంని అమలు చేయడం సాధ్యం కాదు. దీని కోసం యాపిల్ ఫ్లాష్ మెమరీలో ఎల్ఎల్ఎంని నిల్వ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంది. అవసరమైతే దాన్ని డివైస్‌కు కనెక్ట్ చేయవచ్చు.


యాపిల్ దాని జనరేటివ్ ఏఐకి శిక్షణ ఇవ్వడానికి అనేక ప్రధాన న్యూస్, కంటెంట్ క్రియేషన్ కంపెనీలతో చర్చలు ప్రారంభించిందని తెలిసింది. దీని కోసం సంస్థ చాలా సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది. యాపిల్... తనతో డీల్ కుదుర్చుకునే వార్తా సంస్థ తన వార్తా కథనాల ఆర్కైవ్‌కు కూడా యాక్సెస్ ఇవ్వాలని కోరుకుంటుంది.


మరోవైపు యాపిల్ ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. 2024లో లాంచ్ కానున్న ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ తన ఏఐని మార్కెట్లోకి తీసుకువస్తుందేమో చూడాలి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!