Apple iPhone 13 Launch Live Updates: ఐఫోన్ 13 సిరీస్, కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 వచ్చేశాయ్!
ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ ప్రారంభమైంది. భారతదేశ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి 10:30 గంటల నుంచి యాపిల్ కొత్త ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి.
కొత్తగా లాంచ్ అయిన ఎంట్రీ లెవల్ ఐప్యాడ్, కొత్త ఐప్యాడ్ మినీ, వాచ్ సిరీస్ 7, ఐఫోన్ 13 సిరీస్ గురించి టిమ్ కుక్ వివరించగానే యాపిల్ ఈవెంట్ ముగిసింది.
ఐఫోన్ 13 ప్రో ధర 999 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర 1,099 డాలర్లుగా ఉంది. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి, సేల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 13 ప్రోలో నైట్ మోడ్ ఫొటోగ్రఫీని అందించనున్నారు. ఇందులో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కూడా అందించారు. వైడ్ యాంగిల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా జూమ్ ఇన్ చేసే అవకాశం ఉంది. మూడు కెమెరాలు నైట్ మోడ్ ను సపోర్ట్ చేయనున్నాయి. డాల్బీ విజన్ హెచ్ డీఆర్ వీడియో రికార్డింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది.
కొత్త ఐఫోన్ 13 ప్రో సిరీస్ లో 5-కోర్ జీపీయూని అందించారు. వెనకవైపు మ్యాట్ గ్లాస్, ముందువైపు సిరామిక్ షీల్డ్ ఉండనున్నాయి. 120 హెర్ట్జ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను ఇందులో అందించారు. ఇందులో నైట్ మోడ్ ఫొటోగ్రఫీని కూడా అందించారు.
కొత్త ఐఫోన్ 13 ప్రో నాలుగు కొత్త రంగుల్లో లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను అందించనున్నారు.
ఐఫోన్ 13 ధర అమెరికాలో 799 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 మినీ ధరను 699 డాలర్లుగా నిర్ణయించారు.
ఈ కొత్త ఐఫోన్ 13 5జీని సపోర్ట్ చేస్తుందని యాపిల్ తెలిపింది. ఈ సంవత్సరం చివరినాటికి 60 దేశాల్లో 200 క్యారియర్లను సపోర్ట్ చేసే విధంగా సాఫ్ట్ వేర్ సపోర్ట్ అందిస్తామని పేర్కొంది.
కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ కు టైం అయింది. అత్యంత సన్నగా, ఫ్లాట్ గా, అడ్వాన్స్డ్ గా ఉండే కెమెరా సిస్టంను ఇందులో అందించనున్నారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో సూపర్ రెటీనా డిస్ ప్లేను అందించారు. దీని బ్రైట్ నెస్ 1200 నిట్స్ వరకు పెంచుకోవచ్చు.
పింక్, బ్లూ, మిడ్ నైట్, స్టార్ లైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. నాచ్ కూడా గతంలో వచ్చిన ఐఫోన్ల కంటే 20 శాతం చిన్నగా ఉంది.
యాపిల్ వాచ్ సిరీస్ 7 ధర 399 డాలర్లుగా నిర్ణయించారు. వీటి సేల్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
యాపిల్ వాచ్ సిరీస్ 7లో 40 శాతం సన్నని అంచులు అందించారు. దీని బటన్లు రీడిజైన్ చేశారు. డిస్ ప్లే సైజు పెరగడంతో పాటు మరింత బ్రైట్ గా మారింది.
ఈ వాచ్ ఐదు రంగుల్లో లాంచ్ అయింది. సిల్వర్, గ్రాఫైట్, గోల్డ్ స్టెయిన్ లెస్ స్టీల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్యాండ్లను కూడా యాపిల్ కొత్త రంగుల్లో లాంచ్ చేసింది.
యాపిల్ వాచ్ సిరీస్ 6 కంటే వాచ్ సిరీస్ 7.. 33 శాతం వేగంగా చార్జ్ అవుతాయని కంపెనీ తెలిపింది.
దీని ధర 499 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. యాపిల్ చేసిన ప్రకటన ప్రకారం.. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు నేడు ప్రారంభం కానున్నాయి. సేల్ వచ్చేవారం నుంచి ప్రారంభం కానుంది.
యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీని కూడా లాంచ్ చేసింది. ఇందులో 8.3 అంగుళాల స్క్రీన్, ఫీచర్ టచ్ ఐడీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు ఉండనున్నాయి. ఐప్యాడ్ ఎయిర్ లో కూడా ఇవే తరహా ఫీచర్లు అందించారు. గతంలో వచ్చిన ఐప్యాడ్ మినీ కంటే 40 శాతం ప్రభావవంతంగా ఇది పనిచేస్తుందని తెలుస్తుంది. ఇది 5జీని కూడా సపోర్ట్ చేయనుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4కే వీడియోను కూడా ఇది రికార్డ్ చేయగలదు.
దీని ధర 329 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. వచ్చేవారం నుంచి దీని సేల్ ప్రారంభం కానుందని యాపిల్ అధికారికంగా ప్రకటించింది.
ఈ కొత్త ఐప్యాడ్ ఐప్యాడ్ఓఎస్ 15తో పనిచేస్తుంది. సెంటర్ స్టేజ్, ట్రూటోన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. తాజాగా లాంచ్ అయిన క్రోమ్ బుక్స్ కంటే ఇది మూడు రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న సెంటర్ స్టేజ్ ఫీచర్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవడం మరింత సహజంగా ఉంటుంది.
ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ ను ఏ13 బయోనిక్ ప్రాసెసర్ తో లాంచ్ చేసినట్లు మెలోడి కూనా తెలిపారు. గతంలో ఉన్న ఏ12 కంటే ఇది అడ్వాన్స్డ్ ప్రాసెసర్. క్రోమ్ బుక్ కంటే ఇది మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని కునా తెలిపారు.
ఈ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేస్తున్నారు. అయితే ఎన్ని ఐఫోన్లు లాంచ్ అవుతాయనేదేది మరికాసేపట్లో తెలుస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ తరహాలో.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లాంచ్ అవుతాయా లేదా ఫోన్ల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
యాపిల్ లైవ్ ఈవెంట్‌ను యాపిల్ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. యాపిల్ వెబ్‌సైట్ ఈవెంట్ పేజీలో సైతం లైవ్ ఈవెంట్‌ను వీక్షించవచ్చునని టెక్ ప్రియులకు తెలిపింది. యాపిల్ టీవీ యూజర్ అయితే మీరు సైతం యాపిల్ ఐఫోన్ 13 లాంఛింగ్ ఈవెంట్‌ను చూడవచ్చు.
Background
ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ ప్రారంభమైంది. భారతదేశ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి 10:30 గంటల నుంచి యాపిల్ కొత్త ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. యాపిల్ కొత్త ఐఫోన్లతో పాటు మరిన్ని ఉత్పత్తులను కూడా మనముందుకు తీసుకురానుంది. ఈ ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేయనున్న ఉత్పత్తులు ఇవేనంటూ నెట్టింట్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -