Apple Event 2022 Live: యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్
యాపిల్ 2022 ఫార్ అవుట్ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్
ఐఫోన్ 14 ప్రో సిరీస్ లాంచ్ అయ్యాక ఈ ఈవెంట్‌కు యాపిల్ శుభం కార్డు వేసింది.
ఐఫోన్ 14 ప్రో ధరను 999 డాలర్లుగానూ (సుమారు రూ.79,600), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,099 డాలర్లుగానూ (సుమారు రూ.87,600) ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఇక వీటి సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను యాపిల్ లాంచ్ చేసింది. కొత్త డైనమిక్ ఐల్యాండ్ నాచ్ డిజైన్‌ను వీటిలో అందించారు. స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, పర్పుల్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (సుమారు రూ.63,700) నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఐఫోన్ 14 ప్లస్ ధర 899 డాలర్లుగా (సుమారు రూ.71,600) నిర్ణయించారు.
ఐఫోన్ 14 సిరీస్ అమెరికా మోడళ్లలో ఫిజికల్ సిమ్ ట్రేలు అందించలేదు. కేవలం ఈసిమ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతాల్లో ఐఫోన్‌ను ఉపయోగించగలం. అమెరికా, కెనడాల కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా అందించనున్నారు.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ల్లో 12 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. 1.9 మైక్రాన్ పిక్సెల్స్, f/1.5 అపెర్చర్, సీనియర్ షిఫ్ట్ ఓఐఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఐఫోన్ 14లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఐదు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండిట్లోనూ యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించారు. ఇవి మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. కొత్త కెమెరా సిస్టంను కూడా వీటిలో అందించారు.
ఐఫోన్ 14 సిరీస్ లాంచ్‌ను యాపిల్ ప్రారంభించింది. ఐఫోన్ 14 ప్లస్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
వీటి ధరను 249 డాలర్లుగా (సుమారు రూ.19,900) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి, సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి జరగనుంది.
ఈ కొత్త ఎయిర్‌పోడ్స్ ప్రోలో టచ్ కంట్రోల్స్ అందించారు. ఇవి బ్యాటరీని కూడా సమర్థంగా ఉపయోగించుకోనున్నాయి. చార్జింగ్ కేస్‌తో కలుపుకుంటే ఏకంగా 30 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి. స్పేషియల్ ఆడియో, మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు కూడా అందించారు.
యాపిల్ కొత్త తరం ఎయిర్ పోడ్స్ ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది.
యాపిల్ వాచ్ అల్ట్రాలో అన్ని వేరియంట్ల ధరను 799 డాలర్లుగా (సుమారు రూ.63,600) నిర్ణయించారు.
యాపిల్ వాచ్ ఎస్ఈ జీపీఎస్ వేరియంట్ ధర 249 డాలర్లుగానూ (సుమారు రూ.19,900), జీపీఎస్ + సెల్యులార్ వేరియంట్ ధర 299 డాలర్లుగానూ (సుమారు రూ.23,800) ఉంది.
అల్ట్రా పేరుతో యాపిల్ కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. టైటానియం కేస్‌తో దీన్ని రూపొందించారు. యాపిల్ దీనికి యాక్షన్ బటన్ కూడా యాడ్ చేసింది. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఎక్స్‌ట్రా స్పీకర్‌ను కూడా ఇందులో అందించారు.
యాపిల్ వాచ్ ఎస్ఈని నైలాన్ ప్రూఫ్ మెటీరియల్‌తో రూపొందించారు. ఫ్యామిలీ సెటప్స్‌కు ఇది పర్ఫెక్ట్ సెటప్ అనుకోవచ్చు. పిల్లలు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను ఉపయోగించుకోవచ్చు. యాపిల్ వాచ్‌లోని కోర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది.
యాపిల్ వాచ్ ఎస్ఈని కంపెనీ లాంచ్ చేసింది. సిల్వర్, మిడ్‌నైట్, స్టార్ లైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను దీని ద్వారా 80 శాతం తగ్గించనున్నారు.
యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ జీపీఎస్ వేరియంట్ ధర 399 డాలర్లుగానూ, మరో వేరియంట్ 499 డాలర్లుగానూ ఉంది.
ఈ ఫీచర్ బ్యాటరీని అద్భుతంగా సేవ్ చేయనుంది. ఈ సంవత్సరం చివరికి 30కి పైగా క్యారియర్స్‌కు యాపిల్ ఇంటర్నేషనల్ రోమింగ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
యాపిల్ వాచ్ సిరీస్ 8లో యాక్సెలరో మీటర్ ద్వారా తీవ్రమైన క్రాష్‌లను ఈ వాచ్ గుర్తించనుంది. ఈ ఫీచర్‌ను యాపిల్ కొన్ని సంవత్సరాల నుంచి పరీక్షిస్తుంది. ముందువైపు, పక్క వైపు, భారీ తాకిడి, కారు బోల్తా పడటం... ఇలా నాలుగు రకాల ఇంపాక్ట్‌లను యాపిల్ గుర్తిస్తుంది. దీని కోసం యాపిల్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించింది.
యాపిల్ వాచ్ సిరీస్ 8లో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, కొత్త వాచ్ ఫేసెస్, మెరుగైన డ్యూరబులిటీ కూడా ఉన్నాయి. స్విమ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, క్రాక్ రెసిస్టెంట్‌తో ఇది లాంచ్ అవ్వడం విశేషం. మహిళ హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 8ను కంపెనీ ఫార్ అవుట్ ఈవెంట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వాచ్ సిరీస్ ద్వారా అందరితో కనెక్ట్ అయి ఉండవచ్చు. యాపిల్ వాచ్ ద్వారా ఎక్సర్‌సైజ్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటివి చేయవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లను మెయింటెయిన్ చేయడానికి ఈ వాచ్ సాయం చేస్తుంది. ఆరోగ్యం, భద్రత, కనెక్టివిటీ ఇలా అన్నిటినీ సిరీస్ 8 ద్వారా తీసుకురానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమకు రాసిన ఉత్తరాలను కంపెనీ సీఈవో చూపిస్తున్నారు. వాటిలోని కొన్నిటిని చదివి వినిపిస్తున్నారు కూడా.
కొత్త ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ను కంపెనీ సీఈవో టిమ్ కుక్ టీజ్ చేస్తున్నారు.
యాపిల్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ప్రారంభం అయింది.
Background
యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఈ కార్యక్రమంలో లాంచ్ కానున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎలా?
నేడు (సెప్టెంబర్ 7వ తేదీ) భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అయ్యే ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ చానెల్లో లైవ్ ద్వారా చూడవచ్చు. యాపిల్ టీవీ యాప్ ద్వారా కూడా ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
ఏ డివైస్‌లు లాంచ్ కానున్నాయి?
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు ఈ ఈవెంట్లో కచ్చితంగా లాంచ్ కానున్నాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ప్రో కూడా ఈ సిరీస్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో లేటెస్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ తీసుకురానుంది.
ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర ఇటీవలే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ కథనాల ప్రకారం... ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనదేశంలో దాదాపు రూ.75 వేల నుంచి రూ.80 వేల మధ్య నుంచి ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ట్రెండ్ ఫోర్స్ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం... ఐఫోన్ 14 ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000), ఐఫోన్ 14మ్యాక్స్ ధర 849 డాలర్ల (సుమారు రూ.68,000), ఐఫోన్ 14 ప్రో ధర 1,049 డాలర్ల (సుమారు రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,149 డాలర్ల (సుమారు రూ.91,000) నుంచి మొదలుకానుంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉండనుంది.
యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఐఫోన్ 14 మ్యాక్స్‌లో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -