Apple iPhone 17 Series Released: టెక్ ప్రియులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూసిన Apple iPhone 17 సిరీస్‌ వచ్చేసింది. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఆపిల్ ప్రధాన కార్యాలయం కుపెర్టినో, కాలిఫోర్నియాలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఐఫోన్ లేటెస్ట్ సిరీస్‌లో 4 మోడల్‌లను విడుదల చేశారు. స్టాండర్డ్ మోడల్ iPhone 17తో పాటు, అల్ట్రా-స్లిమ్ మోడల్ iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Maxలను యాపిల్ లాంచ్ చేసింది. యాపిల్ కంపెనీ ప్లస్ మోడల్‌ను నిలిపివేసి, దాని స్థానంలో ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్ 7 సరీస్ మొబైల్స్‌తో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్ఈ3 వాచ్ మోడల్స్ ఈ కార్యక్రమంలో యాపిల్ లాంచ్ చేసింది. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా  iphone 17 5 రంగులలో వస్తుంది. ఐఫోన్ 17 కొత్త వేరియంట్లలో ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

Continues below advertisement

iPhone 17

ఐఫోన్ 17 ఫోన్ 6.3 అంగుళాల ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్‌తో వచ్చిన ఈ మోడల్ 7.3mm మందం కలిగి ఉంది. ఇది Apple లేటెస్ట్ A19 చిప్‌ను కలిగి ఉంది. ఇది 8GB RAM. దీని వెనుక భాగంలో 48MP+12MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి. iPhone 17 ముందు భాగంలో సెంటర్ స్టేజ్ కెమెరా ఉంటుంది. కొత్త ఫోన్లలో పలు ఐఏ ఫీచర్లు, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్‌ 17 256 జీబీ వేరియంట్‌ ధరను భారత్‌లో రూ.82,900గా నిర్ణయించారు. లావెండర్‌, తెలుపు, మిస్ట్‌ బ్లాక్‌, సేజ్‌ రంగుల్లో లభిస్తుంది.

Continues below advertisement

iPhone Air

ఐఫోన్ ఎయిర్ 5.6mm మందంతో వచ్చింది. ఐఫోన్ చరిత్రలోలోనే అతి సన్నని మొబైల్ ఇది. ఇది సిరామిక్ షీల్డ్‌తో వస్తుంది. దీని ఫ్రేమ్ టైటానియంతో తయారు చేశారు. ఐఫోన్ ఎయిర్ మొబైల్ నాలుగు రంగులలో లభిస్తుంది. ఇందులోనూ యాపిల్ లేటెస్ట్ A19 Pro చిప్‌సెట్‌ అమర్చారు. వెనుక భాగంలో 48MP ఫ్యూజన్ కెమెరా, ముందు భాగంలో 18MP సెంటర్ స్టేజ్ కెమెరా ఇచ్చారు. ఐఫోన్‌ ఎయిర్‌ 256 జీబీ వేరియంట్‌ ధరను భారత్‌లో రూ.1,19,900గా నిర్ణయించారు. స్పేస్‌ బ్లాక్‌, క్లౌడ్‌ వైట్‌, స్కై బ్లూ, లైట్‌ గోల్డ్‌ రంగులో దొరుకుతుంది.

iPhone 17 Pro

ఈసారి Apple 17 ప్రో మోడల్‌ను వెనుక కొత్త డిజైన్‌తో విడుదల చేసింది. ఇది ప్రోమోషన్ టెక్నాలజీ, ఆల్వేస్ ఆన్-డిస్‌ప్లే సపోర్ట్‌తో 6.3 అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మందం 8.7mm. ఇందులోనూ లేటెస్ట్ A19 Pro చిప్‌సెట్ 12GB RAMతో బేసిక్ వేరియంట్ తీసుకొచ్చింది యాపిల్.  కెమెరా విషయానికి వస్తే దీని వెనుక భాగంలో 48MP+ 48MP+ 48MP ట్రిపుల్ సెటప్ కెమెరాలు,  ముందు భాగంలో 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాక్ కెమెరాలు అన్ని ఒకే మెగా పిక్సెల్‌తో రావడం ఇదే తొలిసారి. గత ఫోన్లకు భిన్నంగా ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇది 8K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్‌తో పాటు డ్యూయల్ కెమెరా రికార్డింగ్‌ సపోర్ట్ చేస్తుంది. భారత్‌లో ఐఫోన్‌ 17 ప్రో 256 జీబీ ధర రూ.1,34,900గా నిర్ణయించారు. డీప్‌ బ్లూ, సిల్వర్‌, కాస్మిక్‌ ఆరెంజ్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

iPhone 17 Pro Max

ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో వచ్చింది. ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు అధికంగా ఉంటాయి. యాంటీ రిఫ్లెక్టివ్, ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లేతో తీసుకొచ్చింది యాపిల్. ఈ ఫోన్ అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్, లేటెస్ట్ A19 Pro చిప్‌సెట్.. వేపర్ ఛాంబర్ కూలింగ్‌ సిస్టమ్ అమర్చారు. గత ఫోన్లలో కంటే అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ. . ఈ ఫోన్లు సిల్వర్‌, కాస్మిక్‌ ఆరెంజ్‌, డీప్‌ బ్లూ రంగుల్లో లభించనున్నాయి. భారత్‌లో  ఐఫోన్‌ ప్రో మాక్స్‌ 256 జీబీ ధర రూ.1,49,900గా నిర్ణయించారు. 

iPhone 17 సిరీస్ ధర ఎంత?, ఎప్పుడు ఆర్డర్ చేయవచ్చు?

  • iPhone 17- $799
  • iPhone Air- $999
  • iPhone 17 Pro- $1099
  • iPhone 17 Pro Max- $1199

    ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ ను శుక్రవారం నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుండి ఈ కొత్త సిరీస్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.