Apple Event 2025: ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్‌లు ఎంత ఎక్కువగా విక్రయాలు జరిగినా, యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. కానీ వీటి ధర అధికంగా ఉంటుంది. అయినా యాపిల్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఔత్సాహికుల కోసం ఆపిల్ ఒకేసారి అనేక కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ మంగళవారం రాత్రి నిర్వహించిన తన Awe Dropping ఈవెంట్‌లో పలు స్మార్ట్ వాచ్2లను విడుదల చేసింది. వీటిలో బడ్జెట్ ధర నుండి ప్రీమియం ఎంపికలు ఉన్నాయి. వీటిని ఈరోజు నుండి ప్రీ బుకింగ్ చేయవచ్చు. సెప్టెంబర్ 19 నుండి అందుబాటులోకి వస్తాయి. ఈ ఈవెంట్‌లో కస్టమర్ల కోసం ఏ కొత్త డివైజ్‌లు వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.
యాపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)
యాపిల్ కంపెనీ ఈ ప్రీమియం వాచ్‌లో మన్నికతో పాటు పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. Apple Watch Ultra 3 ప్రస్తుత మోడల్ కంటే మెరుగైన రిజల్యూషన్ డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. ఇది కొత్త S11 చిప్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన పనితీరుతో గత వాచ్‌ల కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిప్ బ్యాటరీ లైఫ్ ను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకేసారి చేసే ఛార్జ్‌పై ఎక్కువ గంటలు పని చేస్తుంది. ఇది మెరుగైన GPS ట్రాకింగ్, శాటిలైట్ కనెక్టివిటీ, అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లతో వచ్చింది.
యాపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3)
యాపిల్ బెస్ట్, బడ్జెట్ ధరలో వాచ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఛాయిస్. కంపెనీ దాని డిజైన్‌కు ప్రత్యేకంగా ఎలాంటి అప్‌గ్రేడ్ చేయలేదు, కానీ దీనికి కొత్త S11 చిప్ అమర్చారు. ఇది మెరుగైన పనితీరును అందించడానికి దోహదం చేస్తుంది. అలాగే, కొత్త చిప్‌సెట్ దాని బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాపిల్ కొత్త రంగు, పట్టీ ఎంపికలను జత చేసింది. భారత్‌లో ఎస్‌ఈ3 ధర రూ.25,900గా నిర్ణయించారు.
యాపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)
యాపిల్ కొత్త వాచ్ సిరీస్ 11 ను కూడా తాజా లాంచింగ్ ఈవెంట్లో రిలీజ్ చేసింది. దీనిలో కొత్త చిప్‌సెట్ కూడా అమర్చింది. డిస్ ప్లేలో మార్పులు చేశారు. 5G కనెక్టివిటీ కోసం మీడియాటెక్ మోడెమ్ సపోర్ట్ ఇచ్చారు. ఆరోగ్యానికి సంబంధించి.. అధిక రక్తపోటు (High BP)ని గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తుంది. స్లీప్ స్కోర్, నిద్రపోయే సమయం, ఎన్నిసార్లు మెలుకువ వచ్చింది, ప్రతి స్లీప్ స్టేజీలో ఎంత టైం పడుకున్నామో ఈ కొత్త వాచ్‌ల్లో ఉంటాయి. గత సిరీస్ రంగు మసకబారడంపై ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కొత్త రంగు ఎంపికలు, బ్యాండ్ డిజైన్‌లను కూడా తీసుకొచ్చింది. భారత్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ.46,900గా నిర్ణయించారు.
ధర ఎంత?
ఆపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)- $ 799
ఆపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3)- $ 249
ఆపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)- $ 399