Apple Event 2025 Live Event: Apple వినియోగదారుల కోసం కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్, సరికొత్త ఎయిర్ పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్‌లను యాపిల్ తీసుకొచ్చింది. అమెరికాలోని క్యూపర్టినోలోని Apple పార్క్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్ లో కంపెనీ AirPods Pro 3 ని విడుదల చేసింది. AirPods Pro 3 లో కొత్త ఆర్కిటెక్చర్ ఉపయోగించింది. ఇది యూజర్లకు ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇది గతంలోని ఎయిర్ పాడ్స్ తో పోలిస్తే రెట్టింపు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విధానాన్ని కలిగి ఉంటుంది. ఇందులో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉంది.
యాపిల్ AirPods Pro 3ని ఆరోగ్య సంబంధిత కొత్త ఫీచర్ తో రిలీజ్ చేసింది. ఈ ఎయిర్ పాడ్స్ తో ఆడియో వినడంతో పాటు హృదయ స్పందన (Heartbeat)ను కూడా ట్రాక్ చేయవచ్చు. Apple దీనిని హార్ట్-రేట్ ట్రాకింగ్ ఫీచర్ తో తయారు చేసింది. దాంతో పాటు లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఇంకా ఏమున్నాయో చూద్దాం.
గుండె చప్పుడు (Heartbeat)ను తెలుసుకోండి
కొత్త ఎయిర్ పాడ్స్ airpods Pro3 లో LED ఆప్టికల్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి రక్త ప్రవాహం ఆధారంగా హృదయ స్పందనను ట్రాక్ చేస్తాయని Apple సంస్థ తెలిపింది. ప్రధాన మార్పుగా Apple ఇయర్ బడ్స్ డిజైన్ ను సైతం కంపెనీ అప్ డేట్ చేసింది. దీనివల్ల ఇవి మునుపటి కంటే మెరుగ్గా పనిచేస్తాయి. దీని ఛార్జింగ్ కేసులో కూడా మార్పులు చేశారు. ఫిజికల్ బటన్లను తొలగించారు. AirPods 4 లాగే ఇందులో కొత్త టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. దీని ద్వారా Apple ఇతర డివైజ్ లతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు వాటిని iPhone లేదా ఇతర Apple పరికరాలకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చని యాపిల్ పేర్కొంది.
కొత్త చిప్ సెట్ తో బెస్ట్ మోడ్
Apple AirPods Pro 3 ని కొత్త H3 చిప్ తో తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ఎయిర్ పాడ్స్ ప్రో3 ద్వారా గతంలో కంటే మెరుగైన ఆడియో నాణ్యతను గమనిస్తారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. కంపెనీ కొత్త ఎయిర్ పాడ్స్ డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. దాదాపు పాత సిరీస్ లాగానే కనిపిస్తుంది. 2026 లో ఎయిర్ పాడ్స్ ప్రో సిరీస్ కు పెద్ద అప్ గ్రేడ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. హార్డ్ వేర్ పరంగా వచ్చే ఏడాది యాపిల్ లాంచ్ ఈవెంట్లో పెద్ద మార్పులు చూడవచ్చని అనేక నివేదికలు వస్తున్నాయి.
యాపిల్ కొత్త ఎయిర్ పాడ్స్ ధర ఎంత?
AirPods Pro 3 ధర 249 డాలర్లుగా నిర్ణయించారు. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో3ని ఇప్పుడు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.