అమెజాన్‌లో అక్టోబర్ 3వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సేల్‌లో వీడియో గేమ్స్, వాటికి సంబంధించిన యాక్సెసరీలపై భారీ ఆఫర్లు ప్రకటించారు. పీఎస్4, ఎక్స్‌బాక్స్, నిన్‌టెన్‌డో స్విచ్‌లకు సంబంధించిన గేమ్స్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి.


వీటితోపాటు గేమింగ్ కంట్రోలర్స్, హెడ్‌సెట్స్, రేసింగ్ వీల్స్, స్ట్రీమింగ్ డివైసెస్, వీఆర్, థంబ్ గ్రిప్స్, కేసెస్, కవర్స్‌తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన యాక్సెసరీలపై కూడా ఆఫర్లు అందించారు. ఇక పీఎస్4లో ఫిఫా 22, మార్వెల్ స్పైడర్‌మ్యాన్: మైల్స్ మొరాలెస్, సోనీ పీఎస్4 గాడ్ ఆఫ్ వార్, ఘోస్ట్ ఆఫ్ షుషిమా, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2, ఫిఫా 21, ద లాస్ట్ ఆఫ్ అజ్ పార్ట్ 2, గ్రాండ్ తెఫ్ట్ ఆటో 5, స్పైడర్ మ్యాన్, టెక్కెన్ 7, అసాసిన్స్ క్రీడ్ వల్‌హాల్లా, మోర్టల్ కాంబాట్ 11 వంటి గేమ్స్‌పై ఆఫర్లు ఉండనున్నాయి.


Also Read: Amazon Great Indian Festival Sale: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ లాంచ్ నేడే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


ఎక్స్‌బాక్స్ వన్ విషయానికి వస్తే.. వాచ్ డాగ్స్: లీజియన్ రెసిస్టెన్స్ ఎడిషన్, కాల్ ఆఫ్ డ్యూటీ: ఇన్‌ఫినిట్ వార్‌ఫేర్, డబ్ల్యూడబ్ల్యూఈ 2కే16, ఎక్స్‌బాక్స్ వన్ ఫిఫా 19, అసాసిన్స్ క్రీడ్ 4: బ్లాక్ ఫ్లాగ్, మైక్రోసాఫ్ట్ మైన్‌క్రాఫ్ట్ మాస్టర్ కలెక్షన్, అవెంజర్ డీలక్స్ ఎడిషన్, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2, మాఫియా 3, డార్క్ సోల్స్ 3, బోర్డర్ ల్యాండ్స్ 3 గేమ్స్‌పై ఆఫర్లను అమెజాన్ అందించనుంది.


వీటితో పాటు నిన్‌టెన్‌డో స్విచ్‌కు సంబంధించిన గేమ్స్, కన్సోల్స్, యాక్సెసరీలపై కూడా ఆఫర్లు ఉండనున్నాయి. అమెజాన్‌లో అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ సేల్‌లో ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లు లభించనున్నాయి.


మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫుడ్ అండ్ బీవరేజెస్, హెల్త్ అండ్ వెల్‌నెస్, పెట్ సప్లైస్, బేబీ ప్రొడక్ట్స్, బుక్స్, టాయ్స్ అండ్ గేమ్స్, పర్సనల్ కేర్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు, రోజువారీ అవసరాలు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎకో స్మార్ట్ డివైసెస్, ఫైర్ టీవీ డివైసెస్, కిండిల్, మొబైల్స్ యాక్సెసరీలపై కూడా భారీ తగ్గింపులను అమెజాన్ అందించనుంది.


Also Read: Amazon Great Indian Festival Sale: అక్టోబర్‌ 3 నుంచే గ్రేట్‌ ఇండియన్ సేల్‌.. ఆఫర్లు, ప్రత్యేకతలు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి