అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ 8 సిరీస్, 9 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపులు అందించారు. దీంతోపాటు రూ.18,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. దీంతోపాటు మీరు క్రెడిట్, డెబిట్ కార్డుల ఆఫర్లను కూడా తీసుకుంటే.. రూ.7,000 వరకు అదనపు తగ్గింపు లభించనుంది. ప్రస్తుతం వన్‌ప్లస్‌లో మంచి ఆఫర్లు అందుకున్న టాప్-5 ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇవే..


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. వన్‌ప్లస్ 9ఆర్ 5జీ
వన్‌ప్లస్ 9ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.39,999 కాగా, ఈ సేల్‌లో రూ.36,999కే కొనుగోలు చేయవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్‌పై రూ.18,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. సిటీ, యాక్సిస్, ఎస్‌బీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు తగ్గింపు కూడా లభించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 65టీ వార్ప్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


వన్‌ప్లస్ 9ఆర్ 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


2. వన్‌ప్లస్ 9 5జీ
ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.49,999 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.46,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్‌పై రూ.18 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు తగ్గింపు అందించనున్నారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను అందించారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


వన్‌ప్లస్ 9 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


3. వన్‌ప్లస్ 8టీ 5జీ
మీరు మంచి ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఇది కచ్చితంగా మంచి ఆప్షన్. ఈ ఫోన్ అసలు ధర రూ.42,999 కాగా, ఈ సేల్‌లో రూ.38,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ.15 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ అందించనున్నారు. దీంతోపాటు సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 అదనపు తగ్గింపు లభించనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమో లెన్స్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


వన్‌ప్లస్ 8టీ 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


4. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీని ఈ అమెజాన్ సేల్‌లో రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. రూ.16 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్, దీంతోపాటు సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు క్యాష్ బ్యాక్ లభించనున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగాపిక్సెల్‌గా ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


5. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ
తక్కువ బడ్జెట్‌లో మంచి వన్‌ప్లస్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇదే మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.24,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై రూ.16 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభించనుంది. సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు అడిషనల్ క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి