Amazon Great Indian Festival 2024: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న ఇది ఉంటుంది. ప్రైమ్ మెంబర్లకైతే 24 గంటల ముందే నుంచే అంటే సెప్టెంబర్ 26న సేల్ అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే తాజాగా ఈ ఇ-కామర్స్ సంస్థ కిక్‌స్టార్టర్ డీల్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ, ఐకూ, లావా, షావోమీ, టెక్నో వంటి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది.
realme Narzo N63 - ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ కెపాసిటీ 45W ఛార్జింగ్‌తో వచ్చింది. దీన్ని రూ.7,155కే కొనుగోలు చేయొచ్చు.
Redmi 13C 5G - ఈ రెడ్‌మీ 13సీ 5జీను రూ.9,199కే దక్కించుకోవచ్చు. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, 90Hz డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ కెపెసాటీ ఉంది.
iQOO Z9 Lite 5G - ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది. 50ఎంపీ ఏఐ కెమెరాతో పాటు IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.9,499కే అందుబాటులో ఉంది. నో కాస్ట్- ఈఎంఐ కూడా ఉంది.
Lava Blaze 3 5G - ఈ లావా బ్లేజ్3 5జీ 50ఎంపీ + 2ఎంపీ ఏఐ కెమెరాతో వచ్చింది. 90Hz రిఫ్రెష్ రేటు, మీడియాటెక్ డీ6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. దీని ధర కేవలం రూ.9,899.
POCO X6 5G - ఈ పోకో ఎక్స్6 5జీ ఐఓఎస్ పోర్ట్ చేసే 64ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. 1.5కె 120Hz అమోలెడ్ డిస్‌ప్లే కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో దీన్ని విడుదలచేశారు. ఇది రూ.14,999కే లభిస్తోంది.
iQOO Z9 5G - ఈ కర్వ్‌డ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే దొరుకుతోంది. 1800 నిట్స్ డిస్‌ప్లే, సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. డ్యూయల్ స్టెరో స్పీకర్ కూడా ఉంది. దీని ధర రూ.15,999.
OnePlus Nord CE 3 5G - ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీలో 12జీబీ ర్యామ్, 5,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 50ఎంపీ సోనీ IMX890 కెమెరా కూడా ఉంది. దీని ధర రూ.16,749.
iQOO Z7 Pro 5G - ఈ స్మార్ట్ మొబైల్‌ను రూ.19,749కే అందుబాటులో ఉంది. 3డీ కర్వ్‌డ్ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది.
Samsung Galaxy S21 FE - ఈ స్మార్ట్ ఫోన్ 12 ఎంపీ అల్ట్రా- వైడ్ కెమెరాతో లాంఛ్ చేశారు. ఇది రూ.25,749కే లభిస్తోంది.
OnePlus 11R 5G - ఈ వన్‌ప్లస్ 11ఆర్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 + జెన్1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. రూ.26,749కే దొరుకుతోంది. 100W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 120Hz ఫ్లూయిడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Xiaomi 14 - షావోమీ 14ను రూ.47,999కు అందుబాటులో ఉంది. 50ఎంపీ లైకా ట్రిపుల్ లెన్స్‌తో వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్లాట్‌ఫామ్‌తో నడుస్తుంది. 1.5కె 120Hz అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ మొబైల్లో ఉన్నాయి.