శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన పవర్ ఫుల్ 5జీ ఫోన్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ. ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా అందించారు. ఈ ఫోన్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్‌పై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఫోన్ అసలు ధర రూ.38,999 కాగా, రూ.3,000 తగ్గింపును అందించారు. దీంతో ఫోన్ ధర రూ.35,999కు తగ్గింది. సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 అదనపు తగ్గింపు లభించనుంది. అప్పుడు మరింత తగ్గి రూ.34,749కే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందించారు. ఇది మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే వడ్డీ లేకుండా వాయిదాల్లో నగదు చెల్లించవచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ పనిచేయనుంది.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.