అలెక్సా ఫైర్ టీవీ స్టిక్, కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు ప్రత్యేకమైన కంట్రోల్ బటన్స్ అందించారు. దీంతోపాటు ఇతర యాప్స్‌కు కూడా ప్రత్యేకమైన బటన్స్ ఉన్నాయి. 2020లో అసలైన ఫైర్ టీవీ స్టిక్ లాంచ్ అయ్యాక ఇప్పుడు అలెక్సా వాయిస్ రిమోట్‌ను కూడా అమెజాన్ తీసుకురావడం విశేషం.


అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ ధర
దీని ధర మనదేశంలో రూ.2,999గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా సైట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఒరిజినల్ ఫైర్ టీవీ స్టిక్ ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఆ పాత మోడల్ రూ.2,499కు అందుబాటులో ఉంది. 


అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్, కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 8 జీబీ స్టోరేజ్ వఅందించారు. ఫుల్ హెచ్‌డీలో కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు. అయితే కొత్తగా లాంచ్ అయిన బండిల్డ్ అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ మాత్రం గతంలో లాంచ్ అయిన రిమోట్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మ్యూజిక్‌లకు ఇందులో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి.


దీంతోపాటు ఫైర్ టీవీ స్టిక్‌లో అందుబాటులో ఉన్న అన్ని యాప్స్‌కు షార్ట్‌కట్స్ ఈ రిమోట్‌లో అందించారు. వాయిస్ బటన్ ద్వారా వినియోగదారులు అలెక్సాను కూడా యాక్సెస్ చేయవచ్చు. రిమోట్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని మందం 1.6 సెంటీమీటర్లు కాగా, బరువు 42.5 గ్రాములుగా ఉంది.


మొత్తంగా కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌లో గతంలో లాంచ్ అయిన ఫైర్ టీవీ స్టిక్ వాయిస్ రిమోట్ (మూడో తరం) తరహాలోనే పవర్, వాల్యూమ్ బటన్లు ఉన్నాయి.


అమెజాన్ గతేడాది మనదేశంలో ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.6,499గా ఉంది. మీడియాటెక్ ఎంటీ8696 ప్రాసెస‌ర్‌పై ఈ స్టిక్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఈ ఫైర్ టీవీ స్టిక్‌లో ఉన్నాయి. వైఫై 6 క‌నెక్టివిటీని ఇందులో అందించారు.


బ్లూటూత్ వీ5.0ని కూడా ఇది స‌పోర్ట్ చేయ‌నుంది. అంటే బ్లూటూత్ స్పీకర్లు, హెడ్ ఫోన్లు, వీడియో గేమ్ కంట్రోల‌ర్లు వంటివి కూడా దీనికి క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌న్న మాట‌. హెచ్ డీఆర్, హెచ్ డీఆర్10+ ఫార్మాట్ల‌తో పాటు డాల్బీ విజ‌న్, డాల్బీ అట్మాస్ ల‌ను కూడా ఈ స్టిక్ స‌పోర్ట్ చేయ‌నుంది. 


ఈ స్టిక్ మందం 1.4 సెంటీమీట‌ర్లుగా కాగా, బ‌రువు 48.4 గ్రాములు మాత్రమే. లైవ్ వ్యూ అనే ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా వినియోగ‌దారులు టీవీ చూస్తూనే.. త‌మ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ను పీఐపీ ఫీడ్ ద్వారా చూసే అవకాశం లభిస్తుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!