Airtel Xtreme AirFiber vs Reliance Jio AirFiber: వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల మధ్య పోటీ ఉంది. ఎయిర్‌టెల్, జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లలో ఏది బెస్ట్ అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
మీకు రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కావాలంటే దాని కోసం మూడు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో మొదటిది 6000860008 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. రెండోది Jio వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవడం. ఇది కాకుండా మీ ప్రాంతంలోని జియో స్టోర్‌ని సందర్శించడం ద్వారా కూడా కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇలా... (Jio AirFiber Plans)
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ల ధర గురించి మాట్లాడితే ఇది రూ. 599 నుండి మొదలై రూ. 3,999 వరకు ఉంటుంది.
మీరు రూ.599 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు పొందుతారు. దీంతో పాటు అదనంగా చాలా ఓటీటీ యాప్స్‌కు కూడా యాక్సెస్‌ను పొందవచ్చు.
ఇది కాకుండా మీరు రూ. 899 ప్లాన్‌లో భాగమైతే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.
ఇక రూ. 1199 ప్లాన్ గురించి మాట్లాడితే మీరు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మొత్తం 13 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను పొందుతారు.
ఇది కాకుండా రూ. 1499 ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 13 ఓటీటీ యాప్స్ ప్రయోజనం పొందుతారు.
రూ. 2,499 ప్లాన్‌లో 500 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 13 ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్‌ను పొందుతారు.
రూ. 3999 ప్లాన్ 1 జీబీపీఎస్ స్పీడ్‌ని అందిస్తుంది. దీనిలో కూడా మీరు 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, అన్‌లిమిటెడ్ డేటా, 13 ఓటీటీ యాప్స్ ప్రయోజనాన్ని పొందుతారు. అన్ని ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు (Airtel Xtreme AirFiber Plans)
ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్ యొక్క అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు ఇందులో 64 డివైస్‌ల వరకు కనెక్ట్ చేయవచ్చు. ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ధర రూ. 699 నుంచి రూ. 999 వరకు ఉంటుంది. ఈ ప్లాన్లపై కూడా మీరు ప్రత్యేకంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు వేగవంతమైన ఇంటర్నెట్, డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించే వైఫై 6 టెక్నాలజీని పొందుతారు. మీరు రూ.699 ప్లాన్‌ని కొనుగోలు చేస్తే, మీకు 40 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇది కాకుండా రూ.799 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. రూ.999 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కూడా అందుబాటులో ఉంటుంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు