AI Danger: కృత్రిమ మేధస్సు (AI) మన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. హెల్త్, ఎడ్యుకేషన్, సైన్స్, సాంకేతికతలో AI గణనీయమైన మార్పులను తీసుకువస్తున్నప్పటికీ, దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆంత్రోపిక్‌తో సంబంధం ఉన్న ఒక నిపుణుడు ఇటీవల చేసిన ఓ హెచ్చరిక ఏఐపై మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, అత్యంత అధునాతన AI, అణ్వాయుధాలతో సమానమైన స్థాయిలో మానవులకు ముప్పు కలిగించవచ్చని ఆయన అంటున్నారు.
ఏఐ మానవాళికి పెద్ద ముప్పు
ఏఐ సెక్యూరిటీపై పనిచేసే ఆంథ్రోపిక్ ఎక్స్‌పర్ట్ ఇవాన్ హుబింగర్, ఏఐ వ్యవస్థలు మరింత అభివృద్ధి చెందింతే, మానవాళి ఉనికికే ముప్పును ఎదురవ్వచ్చని హెచ్చరించారు. రాబోయే దశాబ్దంలో ఏఐ మానవుల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం 10 శాతానికి పైగా ఉందని ఆయన అంచనా వేశారు. అయితే ఈ అంచనాకు ఒక కచ్చితమైన ఆధారం లేదని, కేవలం జరగబోయే ప్రమాదాల అంచనా మాత్రమే అన్నారు.
అణ్వాయుధాలతో పోలిక ఎందుకు?
అణ్వాయుధాలు భారీ విధ్వంసం సృష్టిస్తాయి. ఏఐ వల్ల జరిగే ముప్పు భిన్నమైన రీతిలో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు సైబర్‌దాడులు, తప్పుడు సమాచారం, నిఘా, ఆయుధ కార్యకలాపాలను చాలా వేగంగా, భారీ స్థాయిలో సులభతరం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ దాడులు, గూఢచర్యం, మోసం, ఆయుధాలకు తప్పుడు మార్గంలో ఉపయోగించడానికి ఏఐను ఉపయోగించే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ ఇటీవలి నివేదికలో తెలిపింది. వీటిల్లో కొన్నింటిని తాము అడ్డుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. రాబోయే మూడు సంవత్సరాలలో ఏఐ మానవ నాగరికతను నాశనం చేయడం ప్రారంభిస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
AI చాలా శక్తివంతంగా
AI వ్యవస్థలు తమ సామర్థ్యాలను సొంతంగా మెరుగుపరచుకునే సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులలో నెలకున్న ప్రధాన ఆందోళన. ఏఐ, సూపర్‌ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై పరిశోధనలు ఈ చర్చకు దారితీసింది. ఏఐ అభివృద్ధి వేగాన్ని ప్రశ్నిస్తూ, ఆంథ్రోపిక్ మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ కూడా కంపెనీకి రాజీనామా చేశారు. ముందుకెళ్లాలనే ఏఐ కంపెనీల మధ్య పోటీ, భద్రతాపరమైన ఆందోళనలను బయటకు రాకుండా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. Also Read: Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
ఏఐకి భయపడాల్సిన అవసరం ఉందా?
ప్రెజెంట్ AI గురించి వినిపిస్తున్న హెచ్చరికలు భవిష్యత్తు అవకాశాలపై ఆధారపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. AI మానవాళిని అంతం చేస్తుందనే వాదనలపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తుంటే, మరికొందరు మరింత జాగ్రత్త ఉండాలని, తక్షణ ప్రమాదాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. అయినప్పటికీ, ఏఐ వినియోగం పెరగడంతో, భద్రతా నిబంధనలు, పర్యవేక్షణ, అంతర్జాతీయ సహాయం అవసరంపై ఏకాభిప్రాయం పెరుగుతోంది. ఏఐ శక్తి వేగంగా పెరుగుతున్న కొద్దీ, భద్రతా వ్యవస్థలను మరింత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. Also Read: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
