iPhone Price Hike: యాపిల్ కంపెనీ కొత్త తరం ఐఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు, పాత మోడళ్ల ధరలను తగ్గించడం ఆనవాయితీ. కానీ ఈసారి యాపిల్ భిన్నమైన నిర్ణయంతో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. భారత్‌లో కొత్తగా ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 17e, ఐఫోన్ ఎయిర్ మోడళ్ల ధరలను పెంచేసింది. 

Continues below advertisement

ఎంత పెరిగాయి?

పాత మోడళ్ల ధరలు పెరగడానికి కారణాలివే! 

1. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెంపు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో గ్లోబల్ డేటా సెంటర్లు, టెక్ కంపెనీల నుండి మెమరీ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్లలో వాడే మెయిన్ పార్ట్స్ ధరలు ఆకాశాన్నంటాయి. మెమరీ చిప్‌ల ధరల పెంపు 100 ఏళ్లలో ఒకసారి వచ్చే వరద లాంటిదని యాపిల్ పూర్వ సీఈఓ టిమ్ కుక్ అభివర్ణించారు. విడిభాగాల ఖర్చులు పెరగడం వల్ల వినియోగదారులపై ఆ భారాన్ని వేయక తప్పలేదని తెలిపారు.

Continues below advertisement

2. ఐఫోన్ 18 స్టాండర్డ్ మోడల్  

యాపిల్ సెప్టెంబర్ 9న జరిగిన ఈవెంట్‌లో 'ఐఫోన్ 18 ప్రో', 'ఐఫోన్ 18 ప్రో మాక్స్'లను మాత్రమే విడుదల చేసింది. కానీ 'ఐఫోన్ 18' మోడల్‌ను లాంచ్ చేయలేదు. దీంతో ప్రస్తుత లైనప్‌లో ఐఫోన్ 17 మాత్రమే ప్రధాన స్టాండర్డ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా కొనసాగుతోంది. ఇది కూడా ధర పెంపునకు ఒక కారణం అయింది.   Also Read: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!

కొనుగోలుదారులపై ఎలాంటి ప్రభావం  

యాపిల్ నిర్ణయంతో కొత్త ఐఫోన్ కోసం వేచి చూసే వాళ్లు తమ ప్లానింగ్ మార్చుకునే అవకాశం ఉంది. సాధారణంగా కొత్త మోడల్ వచ్చాక పాతవి తక్కువ ధరకు వస్తుందని ఆశించే కొనుగోలుదారులకు ఈ ధరల పెంపు నిరాశ మిగిల్చింది.  చాలామంది వినియోగదారులు ఇప్పుడు అధికారిక స్టోర్లలో పెరిగిన ధరలకు ఫోన్లు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. రాబోయే దీపావళి, ఫెస్టివ్ సేల్స్, ఆన్‌లైన్ ఇ-కామర్స్ ఆఫర్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్లు వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు.

 గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు, ఏఐ డిమాండ్ కారణంగా యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త మార్పులకు దారితీసింది. ప్రస్తుతానికి కొత్త ఐఫోన్ కొనాలనుకునేవారు ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ల కోసం వేచి చూడటమే ఇప్పుడు బెస్ట్ చాయిస్.  Also Read: Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి