Do you have WhatsApp on your phone? All your chatting is here: వాట్సాప్ వాడుతున్నారా! మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్, హెల్ప్ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే. మీ వాట్సప్ నెంబర్‌కు 6 డిజిట్ కోడ్ వస్తుంది. ఆ వెంటనే మీ కాంటాక్ట్‌లో ఉన్న ఓ నెంబర్ నుంచి ఆ కోడ్ చెప్పమంటూ మెసేజ్ వస్తుంది. తెలిసిన వారే కదాని ఆ OTP చెప్పేశారా.. ఇక అంతే సంగతి. క్షణాల్లో మీ వాట్సప్ క్రాష్ (Whatsapp Crash) అవుతుంది.
వాట్సాప్ డేటా చోరీ అయ్యే ఛాన్స్
వాట్సాప్‌లో ఉన్న డేటా మొత్తం చోరీకి గురవుతుంది. మీ పాస్‌వర్డ్స్, ఫోటోస్, బ్యాంక్ ఖాతాల వివరాలు, వీడియోస్ ఇలా సర్వం దోచేస్తారు సైబర్ దొంగలు (Cyber Crimes). అంతేకాదు.. హైదరాబాద్‌లో చాలా మంది ప్రముఖుల వాట్సప్ హ్యాక్ అవడం సంచలనంగా మారింది . వాట్సాప్ హ్యాక్ బాధితుల్లో పలువురు సెలబ్రెటీలు, డాక్టర్లు, డ్యాన్సర్లు ఉన్నారు. అయితే తాజాగా చోరీ ట్రెండ్ మార్చారు హ్యాకర్లు. అవును.. మీరు విన్నది నిజమే.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే, అందులో కచ్చితంగా వాట్సాప్ ఉన్నట్టే . అంతలా జనజీవన స్రవంతిలో భాగమైపోయింది వాట్సాప్.
48.7 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా లీక్ !
ఇక ఇదే విషయాన్ని ఆసరగా చేసుకుని మొత్తం 84 దేశాలకు చెందిన 48.7 కోట్ల వాట్సాప్ యూజర్లు ఫోన్ నంబర్లను విక్రయిస్తున్నట్తు హ్యాకర్లు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చారు. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది డేటా.. అత్యల్పంగా రష్యా నుంచి కోటి మంది వాట్సాప్ యూజర్ల నంబర్లు లీకైనట్లు తెలుస్తోంది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ నంబరుకు ఒక్కో ధరతో అమ్మకానికి పెట్టారట. అమెరికా యూజర్ నంబర్ సుమారు రూ. 5,71,690, యూకే డేటా 2500 డాలర్లు, జర్మనీ డేటా 2వేల డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. ఇక గత నెలలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. వాట్సప్ పనిచేయకుండా (hatsapp hack) ఆగిపోయింది. దాదాపు రెండు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ స్తంభించిపోయింది. వాట్సప్ వెబ్‌లోనూ ఇదే పరిస్థితి. పదే పదే ఎర్రర్ మెసేజ్ కనిపించింది.
ఆడియో, వీడియో కాల్స్ కూడా కనెక్ట్ కాలేదు. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఉన్నట్టుండి వాట్సాప్ హ్యాండ్సప్ చెప్పింది. మెసేజ్‌లు పోవు, రావు. చాలా మంది మొదట్లో తమ ఫోన్‌లో లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అనుకున్నారు. అన్‌ఇన్‌స్టాల్ చేసి చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసి చాలా స్టంట్స్ చేశారు. దాదాపు 120 నిమిషాల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాట్సప్ మళ్లీ టిక్ టిక్ అంటూ మోగింది. వాట్సప్ చరిత్రలో ఇంత సేపు అది పనిచేయకుండా ఉండటం అదే మొదటిసారి.