Motorola Edge 50 Pro Flipkart Sale: మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్‌లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించడం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో రన్ కానుంది. మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్‌ను కంపెనీ అందించనున్నట్లు ప్రకటించింది.


మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో ధర, ఆఫర్లు
మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.31,999కు కంపెనీ విక్రయించనున్నట్లు ప్రారంభంలో ప్రకటించింది. కానీ ప్రస్తుతం సేల్‌లో ఇవి అసలు ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. త్వరలో మరింత స్టాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


బ్లాక్ బ్యూటీ, లూక్స్ లావెండర్, మూన్‌లైట్ పెరల్ కలర్ ఆప్షన్లలో మోటొరోలా ఎడ్జ్ 50 ప్రోను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందించనుంది. దీంతోపాటు ఎక్స్‌చేంజ్ బోనస్ కింద అదనంగా మరో రూ.2,000 తగ్గింపు కూడా లభించనుంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో రన్ కానుంది. మూడు సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్ పొందనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ వరకు ఈ ఫోన్‌కు లభిస్తుందని అనుకోవచ్చు. మోటొరోలా ఎడ్జ్ 50 ప్రోలో 6.7 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా కంపెనీ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. రూ.30 వేలలోపు ధరలో ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ కెమెరా ఫోన్ ఇదే అని చెప్పవచ్చు.


మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌ కాగా, 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ట్ టర్బో ఛార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే 68W ఛార్జర్‌ను, 12 జీబీ ర్యామ్ వేరియంట్ కొనుగోలు చేస్తే 125W ఛార్జర్‌ను బాక్స్‌లో అందించనున్నారని కంపెనీ తెలిపింది. ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.



Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు