Google Amazing Facts: మనం గూగుల్ ప్రొడక్టు ఉపయోగించని రోజు ఒక్కటైనా ఉంటుందా..? ఏ సమాచారం కావాలన్నా గూగుల్ Google సెర్చ్, అఫీషియల్ మెయిల్ కోసం Gmail, ఆఫీసు వర్క్ కోసం Google Docs, వీడియోలు చూడాలంటే.. Youtube, ఆండ్రాయిడ్యాప్లుఇలా మన ఇంట్లోకి Google వచ్చేసిందా.. లేక గుగులమ్మ ఇంట్లో మనం ఉన్నామో అర్థం కానంత స్థాయిలో ఇది మన జీవితంలో భాగమైపోయింది. సెప్టెంబర్ 27 గూగుల్ పుట్టినరోజు.. ఇవాల్టికి గూగుల్ పుట్టి 27 సంతత్సరాలు. 27th బర్త్‌డే సందర్భంగా గూగుల్ గురించి 27 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
గూగుల్ గురించి 27 అద్భుతమైన వాస్తవాలు:(27 Amazing Facts about Google):
1. అసలు పేరు 'బ్యాక్‌రబ్':స్టాన్‌ఫోర్డ్‌లో గూగుల్సహవ్యవస్థాపకులులారీ పేజ్, సెర్గీబ్రిన్అభివృద్ధి చేసిన సెర్చ్ ఇంజన్ మొదటి పేరు "బ్యాక్‌రబ్"(BackRub). ఇది వెబ్‌సైట్ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి దాని బ్యాక్‌లింక్‌లనువిశ్లేషించేది.
2. అది ఒక తప్పు పేరు:గూగుల్(Google)అనే పేరు "గూగోల్"(Googol)అనే గణిత పదానికి తప్పుగా రాసిన రూపం. గూగోల్ అంటే 1 తరువాత 100 సున్నాలు ($10^{100}$)ఉండే సంఖ్య.
3. LEGO బ్లాక్‌తో సర్వర్: చిన్న పిల్లలు ఆడుకునే LEGO బిల్డింగ్ బ్లాక్స్ తెలుసు కదా.. మొదట సెర్చ్ ఇంజన్ డేటా కోసం LEGO బ్రిక్స్ తో సర్వర్ రూమ్ తయారు చేశారు. దాన్నైతే.. ఎప్పటికప్పుడు తీసి పెంచుకోవచ్చుని.. !
4. మొదటి ఆఫీస్ ఒక గ్యారేజ్: గూగుల్ మొదటి ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో సూసన్వోజిస్కీ కి (Susan Wojcicki) చెందిన ఓ అద్దె గ్యారేజ్.
5. ఆల్ఫాబెట్ (Alphabet Inc.):మొదట గూగుల్ పేరుతో మొదలైనా.. ఆ తర్వాత.. గూగుల్ అనుబంధ సంస్థలన్నీ ఆల్ఫాబెట్ అనే కొత్త మాతృ సంస్థ (Parent Company) కిందకు వచ్చాయి. 2015లో దీనిని స్థాపించారు
6.ఉద్యోగులు (Googlers & Nooglers): 2024 నాటికి, ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,80,000 మందికి పైగా పూర్తికాల ఉద్యోగులను (Full-timeemployees) కలిగి ఉంది.గూగుల్ఉద్యోగులను'Googler'అని, కొత్తగాగూగుల్లోచేరినవారిని 'Nooglers' అని పిలుస్తారు. అన్నిగూగుల్ఆఫీసుల్లో 5 స్టార్రేంజ్ఫుడ్ఫ్రీ..!
7.టి-రెక్స్Mascot:కాలిఫోర్నియాలోనిగూగుల్హెడ్క్వార్టర్ Google Plexలో"స్టాన్" (Stan) అనే పేరు గల ఒక పెద్ద టి-రెక్స్ అస్థిపంజరం ఉంది. కంపెనీ అంతరించిపోకుండా, నిరంతరం కొత్త ఆలోచనలతో ఉండాలని ఉద్యోగులకు గుర్తుచేయడానికి ఇది అక్కడ ఉంచారు
8.గూగుల్ Market Cap, Revenue:ఆల్ఫాబెట్ ఇంక్. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి.దాని మార్కెట్ క్యాపిటలైజేషన్$2 ట్రిలియన్ (రెండు లక్షల కోట్ల డాలర్లు, కోటీఅరవైలక్షలకోట్లు) ఉంటుంది.గూగుల్కిందటిఏడాదిఆదాయం 26లక్షలకోట్లు. ఆకంపెనీలాభం 6లక్షలకోట్లు..! కేవలంగుగూల్లాభమేచాలాదేశాలజీడీపీకంటేఎక్కువ.
9.1 మిలియన్కుబేరం: ప్రారంభరోజుల్లో, లారీ,సెర్గీకంపెనీమొత్తాన్నిఎక్సైట్ (Excite) అనేసంస్థకుకేవలం$1 మిలియన్కుఅమ్మడానికిప్రయత్నించారు, కానీ ఆ సంస్థCEO నిరాకరించారు.
10. Google Storage Exabytes: Gmail, Drive, Photos, YouTube మొత్తండేటానిల్వసామర్థ్యం పదులఎగ్జాబైట్స్Exabytes లోఉంటుంది. ఒకఎగ్జాబైట్అంటేసుమారు 100 కోట్లGB
11. Google Data Centres:మనఫోటోలు...YouTube వీడియోలుమొత్తంక్లౌడ్లోడేటాసెంటర్లలోసేవ్అవుతాయి. గూగుల్కుప్రపంచవ్యాప్తంగాచాలాడేటాసెంటర్లుఉన్నాయి. కొన్నిసెంటర్లుకోటిచదరపుఅడుగులవిస్తీర్ణంలోకూడాఉన్నాయి. అంటేదాదాపు 230 ఎకరాలు
12. 15% New Searches: గూగుల్లోప్రతీరోజూ 850కోట్లసెర్చ్లుజరుగుతాయి. అందులో 15శాతంకొత్తసెర్చ్లే. అంటేదాదాపు 120 కోట్లకొత్తవిషయాలనుగూగుల్లోవెతుకుతుంటారుఅన్నమాట
13. గూగుల్మొదటిట్వీట్: 2009లో గూగుల్చేసినమొట్టమొదటిట్వీట్ "I'm feeling lucky".ఈవాక్యాన్నిబైనరీకోడ్లోరాసింది.
14. Googling: గూగుల్చేయడంకూడాఓక్రియ. Google అనేపదాన్ని2006లో అధికారికంగామెరియం-వెబ్‌స్టర్, ఆక్స్‌ఫర్డ్ఇంగ్లీష్డిక్షనరీలలోఒకక్రియ (Verb)గాచేర్చారు.
15. గూగుల్విద్యుత్వినియోగం:ఒకప్పుడు, ఒకేగూగుల్సెర్చ్‌కుపట్టేకంప్యూటింగ్శక్తిసుమారుగాఅపోలో 11 వ్యోమగాములనుచంద్రుడిపైకిపంపడానికిపట్టినంతశక్తికిసమానమనిఅంచనావేశారు
16. GMAIL ఏప్రిల్ఫూల్స్ డే: Gmail అనేఉచితఇమెయిల్సర్వీస్ఏప్రిల్ 1, 2004న ప్రారంభించారు. దీంతో 1GB ఉచితస్టోరేజ్ఆఫర్‌నుచాలామందిమొదట్లోఏప్రిల్ఫూల్స్జోక్‌గాభావించారు.
17. డేటాసెంటర్లలోరోబోట్లు:గూగుల్యొక్కకొన్నిడేటాసెంటర్‌లలోమానవులకంటే **రోబోట్లు** ఎక్కువపనిచేస్తాయి. విఫలమైనహార్డ్డ్రైవ్‌లను (Failed Hard Drives) తీసివేయడంమరియుకొత్తవాటినిఇన్స్టాల్చేయడంవంటిపనులనుఇవిచేస్తాయి.
18. Google Secret Lab -(Google X):ఆల్ఫాబెట్‌లో X అనేపేరుతో ఒక రహస్య ప్రయోగశాల ఉంది. దీనిని మూన్‌షాట్ ఫ్యాక్టరీ (Moonshot Factory) అని కూడా అంటారు. ఇక్కడ కేవలం సెర్చ్ ఇంజన్‌కు సంబంధించినవి కాకుండా, మానవాళికిఉపయోగపడే భవిష్యత్ టెక్నాలజీలపైన పరిశోధన చేస్తారు.వేమో (Waymo) సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, గూగుల్ గ్లాస్ (Google Glass),బెలూన్లద్వారాఇంటర్నెట్అందించేప్రాజెక్ట్ లూన్(Project Loon) ఇక్కడనుంచేవచ్చాయి.
19.ఆండ్రాయిడ్ కొనుగోలు: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ను (Android) గూగుల్ 2005లో $50 మిలియన్లకుకొనుగోలుచేసింది
20: Youtubeకొనుగోలు:గూగుల్ 2006లో యూట్యూబ్‌ను$1.65 బిలియన్లకుకొనుగోలుచేసింది, ఇదిచరిత్రలోఅత్యంతతెలివైనటెక్కొనుగోళ్లలోఒకటిగాచెబుతారు
21: మొదటికార్పొరేట్డాగ్: గూగుల్‌ప్లెక్స్‌లోని మొదటిఅధికారికకంపెనీకుక్కఒకరాట్‌వైలర్ (Rottweiler) దానిపేరు యోష్కా(Yoshka).
22: జెన్నిఫర్లోపెజ్తోగూగుల్ఇమేజ్సెర్చ్: 2001లో గూగుల్ఇమేజ్సెర్చ్ప్రారంభించడానికికారణం... 2000 సంవత్సరంలోగ్రామీఅవార్డులకుజెన్నిఫర్లోపెజ్ధరించినపచ్చటివెర్సెస్ (Versace) గౌన్చిత్రాలకోసంలక్షలాదిమందివెతకడం.
23. గూగుల్‌కుమీఅడ్రస్తెలుసు:మీరుప్రపంచంలోఎక్కడఉన్నాగూగుల్కుతెలుస్తుంది. గూగుల్స్ట్రీట్ వ్యూ28 మిలియన్మైళ్లరహదారులనుఫోటోలు తీసింది.
24: గూగుల్లోమేకలు:మౌంటెన్ వ్యూలోని గూగుల్‌ప్లెక్స్ చుట్టూ ఉన్న గడ్డి, పొదలను కత్తిరించడానికి, శబ్దంతో కూడిన యంత్రాలకు బదులుగా గూగుల్ సుమారు 200 మేకలమందను అద్దెకు తీసుకుంటుంది
25: ఐ యామ్ఫీలింగ్ లక్కీ:గూగుల్సెర్చ్లోమొదటఈబటన్ఉండేది.అప్పట్లోదానిమీదక్లిక్చేస్తే...నేరుగావెబ్సైట్లవద్దకుతీసుకెళ్తుంది. దీనివల్లగూగుల్కోట్లరూపాయల్లోప్రకటనలఆదాయంకోల్పోయినాకూడాయూజర్లకుఆథ్రిల్ఉండాలన్నఉద్దేశ్యంతోదానినికొనసాగించింది.
26: సముద్రపు అడుగున కేబుల్స్: గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద Undersea Internet Cable నెట్‌వర్క్ ఉంది. ఇది సెర్చ్ స్పీడ్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దాని స్వంత "కర్లీ" (Curie) అనే కేబుల్ అమెరికా నుండి చిలీ వరకు విస్తరించి ఉంది.
27. గూగుల్ Graveyard:గూగుల్ నిలిపివేసిన ఉత్పత్తులు సేవల (Google+, GoogleReaderవంటివి) సుదీర్ఘ జాబితాను ట్రాక్ చేసే వెబ్‌సైట్‌లు ఉన్నాయి, దీనికి "గూగుల్ గ్రేవియార్డ్" అని పేరు పెట్టారు
