WPL 2026 Auction Sricharani:

Continues below advertisement

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ కోసం దిల్లీలో జరిగిన మెగా ఆక్షన్‌లో భారత మహిళల జాతీయ జట్టు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి  ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు చేరారు. ముంబై ఇండియన్స్ (MI)తో  బిడ్ యుద్ధం జరిగిన తర్వాత, ఆమెను DC కోటి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. WPL 2025లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడిన చరణి, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఈసారి పెద్ద మొత్తానికి  ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడబోతున్నారు.   భారత మహిళల ODI వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెను దక్కించుకునేందుకు చాలా జట్లు పోటీ పడ్డాయి. 

WPL 2026 ఆక్షన్ మార్కీ ప్లేయర్స్ రౌండ్‌తో మొదలైంది. చరణి బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలు. మొదట DC బిడ్ వేసింది, తర్వాత MI జట్టు పోటీ పడింది. రెండు జట్టుల మధ్య తీవ్రమైన బిడ్ వార్ జరిగి, చివరికి DC  ఆమెను సొంతం చేసుకుంది. ఈ బిడ్, ఆక్షన్‌లో చరణి ధరను గణనీయంగా పెంచింది. DC కెప్టెన్ మెగ్ లాన్నింగ్  చరణి మా బౌలింగ్ యూనిట్‌కు బలం అని చెప్పారు. 

Continues below advertisement

 

 WPL 2026 సీజన్ మార్చి 2026లో మొదలవుతుంది. ఈ ఆక్షన్‌తో టీమ్‌లు బ్యాలెన్స్‌డ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసుకున్నాయి. UPW బ్యాటింగ్-బౌలింగ్ బ్యాలెన్స్‌తో ఫేవరెట్‌గా మారింది. MI, GG కూడా బలమైన లైనప్‌లు. హీలీ అన్‌సోల్డ్‌గా మిగిలడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు షాక్ గా మారింది.  

 శ్రీ చరణి, భారత మహిళల జాతీయ జట్టు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్. WPL 2025లో DCకు చేరిన ఆమె, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మాత్రమే ఆడారు. కానీ, తన కంట్రోల్డ్ బౌలింగ్, ప్రెషర్ సిట్యువేషన్లలో కూల్‌నెస్‌తో జట్టు ఆసక్తిని ఆకర్షించారు. 2025 ODI వరల్డ్ కప్‌లో భారత్ విజయంలో చరణి కీలక పాత్ర పోషించారు. జూన్ వరకు అన్‌లైక్లీ స్టార్టర్‌గా ఉన్నప్పటికీ, ఆమె పెర్ఫార్మెన్స్ భారత్‌ను ట్రోఫీ సాధించేలా చేసింది. దేశీయ క్రికెట్‌లో ఆమె విశ్వసనీయ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నారు.                                          

 అన్ని ఫేజ్‌లలో  పవర్‌ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్  బౌలింగ్ చేయగల సామర్థ్యం. కెప్టెన్లు ఆమెను డిపెండబుల్ ప్లేయర్‌గా భావిస్తారు. 2025 సీజన్‌లో DCకు 15 వికెట్లు తీసి, జట్టు ప్లేఆఫ్‌కు చేర్చారు.